‘వినయ విధేయ రామ’ కొత్త లుక్ అదుర్స్…రాంచరణ్ ఎంత క్లాస్‌గా ఉన్నాడో.

311

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for vinaya vidheya rama

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ను ఈ మధ్యనే విడుదల చేశారు.ఆ లుక్ అందరిని అలరించింది.అయితే ఆ లుక్ మాస్ గా ఉందని అనుకున్నాడో ఏమో గానీ ఇప్పుడు మరొక క్లాస్ లుక్ ను విడుదల చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవిధేయ రామ చిత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాంచరణ్ అదిరిపోయే క్లాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నాడు. రాంచరణ్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ పోస్టర్ ఆహ్లాదభరితంగా ఉంది. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.