వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ రిలీజ్…కేక పుట్టించేలా ఉంది..

364

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for vinaya videya rama

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ మంచి క్రేజ్ వచ్చింది.అయితే తాజాగా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. దేవి శ్రీ బాణీల్లో ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోనున్న ఈ ఫ్యామిలీ సాంగ్‌ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

4 నిమిషాల 20 సెకనుల నిడివితో కూడిన ఈ పాటలో చిత్ర షూటింగ్ సమయంలోని పలు సన్నివేశాలు చూపించారు. తెలుపు దుస్తుల్లో వినయం, విధేయత అన్నీ కలగలిపిన లక్షణాలున్న అబ్బాయిగా చెర్రీ లుక్ మెగా అభిమానులకు కన్నుల పండగ అవుతోంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.