వినయ విధేయ రామ కొత్త పోస్టర్ సూపర్.. రేపే ఆడియో ట్రైలర్ విడుదల..

279

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for vinaya vidheya rama

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ రెండు సాంగ్స్ అభిమానులను అలరిస్తున్నాయి. మెగా అభిమానులంతా వినయ విధేయ రామ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసే సమయాన్ని తెలియజేస్తూ తాజగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Vinaya Vidheya Rama new poster goes viral

రాంచరణ్ హార్స్ రైడింగ్ చేస్తున్న ఈ పోస్టర్ అభిమానులచేత కేక పెట్టించే విధంగా ఉంది. డిసెంబర్ 27 భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యనున్నారు. ఆ వేడుకలోనే 9 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు.