సెప్టెంబర్ లో ఎంట‌ర్ అవ‌నున్న విక్ర‌మ్

289

విక్ర‌మ్ త‌మిళ స్టార్ హీరోల‌లో ఒక‌డు, ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌రంగంలో విల‌క్ష‌ణ న‌టుడిగా ఆయ‌న‌కు పేరు ఉంది… ఇక తాజాగా విక్ర‌మ్ త్రిష‌లు జంట‌గా ద‌ర్శ‌కుడు హ‌రి సామి స్క్వేర్ సినిమా రూపొందిస్తున్నారు.. ఈ సినిమా 2003 లో వ‌చ్చిన సామికి సీక్వెల్ .. ఇందులో చియాన్ విక్ర‌మ్ పోలీస్ ఆఫిస‌ర్ గా న‌టిస్తున్నారు.. ఇక ఈ సినిమా దీపావ‌ళికి రిలీజ్ అవుతుంది అని డిసెంబ‌రులో రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు.. కాని ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్.

Image result for విక్ర‌మ్
ఈ సినిమాని దీపావ‌ళి కంటే ముందే విడుద‌ల చేయాలి అని చిత్ర‌యూనిట్ భావిస్తోంది.. సెప్టెంబ‌ర్ లో వినాయ‌క చ‌వితి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర‌యూనిట్.. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి…. కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు… బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.