విజయనిర్మల ఆస్తి ఎంతో తెలిస్తే మతిపోతుంది

2276

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ సినీ చరిత్రలో ఏ మహిళా దర్శకురాలికి సాధ్యంకాని అరుదైన గుర్తింపు పొందిన విజయ నిర్మలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. తొలుత నానక్‌రామ్ గూడలోని ఆమె ఇంటి నుంచి పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు, అక్కడ కాసేపు ఉంచి మెయినాబాద్‌ మండలం చిలుకూరు సమీపంలో వారి ఫామ్‌హౌస్‌‌‌కు తరలించారు. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తిచేశారు. అభిమాన నటి కడసారి చూపుకోసం అభిమానులు, ప్రజలు భారీగా తలివచ్చారు. విజయ నిర్మల మరణంతో ఆమె భర్త కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. చివరిసారిగా విజయ నిర్మల పార్ధీవదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఈ సమయంలో ఆయన పరిస్థితి చూసినవారందరూ కంటతడి పెట్టుకున్నారు.

Image result for vijaya nirmala

శాస్త్రోక్తంగా అన్నింటి పూర్తిచేసి కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు. నటిగా, దర్శకురాలిగానే కాదు, కుటుంబ పెద్దగానూ తనదైన ముద్రవేశారు. అప్పట్లో సినిమా షూటింగ్‌లతో కృష్ణ బీజీగా ఉంటే కుటుంబాన్ని ఆమె చూసుకున్నారు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. అంతకు ముందు మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షించారు.ఇప్పుడు విజయనిర్మల వీలునామా బయటపడింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆమె ముందుగానే తన వీలునామా రాసిపెట్టింది. విజయనిర్మల పేరుమీద చాలా ఆస్తులు ఉన్నాయి. విజయనిర్మల ఆ రోజుల్లోనే నానక్ రామ్ గూడలో మంచి పెట్టుబడులు పెట్టారు. ఆనాటి తరం తారలతో అందరి కంటే విజయనిర్మల ఆర్థికంగా బలంగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి ముందే జాగ్రత్త పడ్డారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఆమెకు వారసత్వంగా వచ్చిన ఒక ఇల్లు ఉంది. అందులో ఆమె అన్నలకు ఈమెకు భాగం ఉంది. ఆ ఇల్లు చెన్నైలో ఉంది. అలాగే నానక్ రామ్ గూడలో ఉన్న ఇల్లు ఆమె పేరు మీదనే ఉంది. పక్కనే విప్రో ఉండడంతో అక్కడ ఐటి చాలా డెవలప్ అవుతుంది. ఈ ఇల్లు దగ్గర దగ్గర 40 కోట్ల వరకు పలుకుతుంది. అలాగే చిలుకూరు దగ్గరలో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. దాని విలువ కూడా 20 కోట్ల వరకు ఉంటుంది. అలాగే ఫిలిం నగర్ లో ఒక ఇల్లు ఉంది. దీని విలువ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఈమె పేరు మీద దాదాపు 20 ఎకరాల పొలం ఉంది. దీని విలువ కూడా కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆస్థి మొత్తం ఆమె ఒక్కగానొక్క కొడుకుకు రాసిందేమో అని అనుకున్నారు. కానీ విజయ నిర్మల ఆమె ఆస్తిని కొడుకుకు రాయలేదు. ఆమెకు ఇద్దరు మనువళ్లు ఉన్నారు. ఈ ఆస్థి మొత్తం ఆమె ఇద్దరు మనువళ్ళకు సమానంగా చేరేలా రాసింది. మరి విజయనిర్మల వీలునామా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.