విజయ్ సేతుపతి రియల్ స్టోరీ..

526

విజయ్ సేతుపతి… తమిళ్ లో ఒక స్టార్ హీరో. ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే జీవిస్తాడు. అనధి కాలంలోనే తమిళనాట స్టార్ హీరోగా ఎదిగాడు. అజిత్ కుమార్, విజయ్‌ల తర్వాత విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ ప్రేక్షకులు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. అయితే అతను ఈ స్థాయికి సాధారణంగా రాలేదు. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పొజిషన్ కు వచ్చాడు. ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహ రెడ్డి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అతని లైఫ్ స్టోరీ మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

Image result for విజయ్ సేతుపతి

బాల్యం, చదువు, కుటుంబం..
విజయ్ సేతుపతి 16 జనవరి 1978 లో తమిళనాడులోని రాజపాలయంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కలిముత్తు, సరస్వతి. ఇతను ఆరవతరగతి వరకు రాజపాలయంలోనే చదువుకున్నాడు. తర్వాత వీరి కుటుంబం చెన్నైకు వెళ్లిపోయారు. విజయ్ కోడంబాక్కంలోని ఎంజిఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ ను, లిటిల్ ఏంజిల్స్ మాట్ హెచ్ ఆర్ సెక్ స్కూల్ లో చదివాడు. ఇతను చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. తర్వాత తోరాయిపాకం లోని ధన్రాజ్ బైద్ జైన్ కాలేజీనుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందాడు. కాలేజ్ పూర్తీ చేశాకా ఒక సిమెంట్ కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ చేశాడు. ఇతనికి ముగ్గురు అక్కచెల్లెలు ఉన్నారు. కుటుంబ పోషణ ఇబ్బంది అవ్వడంతో దుబాయ్ కు వెళ్లి జాబ్ చేశాడు. అక్కడే అతనికి జెస్సి అనే అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరు ప్రేమించుకుని 2003 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు సూర్య, కూతురు శ్రీజా ఉన్నారు. ఇక అక్కడ చేసే జాబ్ నచ్చకపోవడంతో తిరిగి ఇండియా వచ్చేశాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత విజయ్ రెడీమేడ్ కిచెన్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడే డైరెక్టర్ బాలు మహేంద్ర ఇతనిని చూసి నటుడిగా ట్రై చెయ్యమని చెప్పాడు. దాంతో విజయ్ సేతుపతి నటుడు అవ్వాలని డిసైడ్ అయ్యి నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Image result for విజయ్ సేతుపతి

సినీ కెరీర్..
2004 లో చెన్నైకి చెందిన థియేటర్ గ్రూప్ కూతు-పి-పట్టరైలో అకౌంటెంట్ గా చేరాడు. అక్కడ నటీనటులను దగ్గర నుంచి చూశాడు. విజయ్ కు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కొన్ని సినిమాలలో హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్స్. 2006 లో పెన్నో అనే సీరియల్ లో నటించే ఛాన్స్ వచ్చింది. కళైగ్నర్ టీవీ కోసం కొన్ని షార్ట్ ఫిలిం లలో నటించాడు. కార్తీక్ సుబ్బరాజుతో కలిసి చాలా షార్ట్ ఫిలిం లలో నటించాడు.తరువాత ధనుష్ హీరోగా నటించిన పుదుపెట్టై అనే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. తర్వాత అఖాడా అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది.ఏ సినిమా తమిళ్, కన్నడలో తీశారు. తమిళ్ లో హీరోగా, కన్నడలో విలన్ గా నటించాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. తర్వాత డైరెక్టర్ సుసేంతిరాన్ తన రెండు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత డైరెక్టర్ సుసేంతిరాన్, విజయ్ సేతుపతి డైరెక్టర్ శీను రామస్వామికి పరిచయం చేశాడు. శీను రామస్వామి దర్శకత్వంలో వచ్చిన తెన్మెర్కు పరువాకత్రు అనే సినిమాలో మొదటిసారి హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ఇన్ సినిమాకు మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో విజయ్ సేతుపతి హీరోగా ఛాన్సులు వచ్చాయి. బాలాజీ డైరెక్షన్ లో నడువులా కొంజం పక్కా కనోమ్ అనే సినిమాలో హీరోలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత పిజ్జా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో కూడా పిజ్జా అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఇది ఒక కామెడీ హర్రర్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తమిళ్ లో విజయ సేతుపతి మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమాలో నటనకు విజయ్ సేతుపతి ఎడిసన్ అవార్డు అండ్ బిగ్ ఎఫ్ఎమ్ తమిళ ఎంటర్టైన్మెంట్ అవార్డులు వచ్చాయి.

Image result for విజయ్ సేతుపతి

తర్వాత 2013 లో సూదు కవ్వుమ్‌ లో నటించాడు. ఈ సినిమాలో 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నటించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత గోకుల్ డైరెక్షన్ లో ఇధార్కుథనే ఆసిపట్టై బాలకుమార సినిమాలో నటించాడు. ఈ సినిమాలో విజయ్ నటనను మెచ్చుకొని వారు ఉండరు. విమర్శకుల ప్రశంసలు అందాయి. 2014 లో రమ్మీ అండ్ పన్నయ్యరం పద్మినియం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా మంచి హిట్ సాధించాయి. ఆ తర్వాత వాన్మం, పురంపోక్కు ఇంగిరా పోదువుదమై సినిమాలలో నటించాడు. తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ఆరెంజ్ మిత్తై అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ సాధించకపోయినా నష్టాలను మిగిల్చలేదు. తర్వాత నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమాలో నటించాడు. ఇది తెలుగులో నేను రౌడీనే అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఇక 2016 లో సేతుపతి అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ సినిమా కాదలుమ్ కధందు పోగుం అనే సినిమాలో నటించాడు. తర్వాత ఇరైవి, పురియథ పుతిర్, కారుప్పన్, విక్రమ్ వేధా, ఓరు నల్లా నాల్ పాతు సోల్రెన్, జుంగా, మణిరత్నం డైరెక్షన్ లో చెక్క చివంత వానం, డీలక్స్, సీతాకత్తి సినిమాలలో నటించాడు.

Image result for విజయ్ సేతుపతి

ఇక 2018 లో వచ్చిన 96 సినిమా అయితే విజయ్ సేతుపతిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఒక అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. త్రిష, విజయ్ సేతుపతి కెమిస్ట్రీకి ఫిదా అవ్వని సినీ ప్రేమికులు లేడు. ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇలా ఇప్పటివరకు దాదాపు 28 సినిమాలో నటించాడు. విజయ్ సేతుపతి సినిమాలే కాదు సమాజసేవ చెయ్యడంలో కూడా ముందు ఉంటాడు. 2014 లో, చెన్నై మయోపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ & రీసెర్చ్ సెంటర్ కండరాల డిస్ట్రోఫీపై అవగాహన పెంచడానికి ఆగస్టు 3 న మెరీనా బీచ్‌లో ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో నటులు గాయత్రీ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి సేతుపతి పాల్గొన్నారు.

Image result for విజయ్ సేతుపతి

అవార్డ్స్…
సుందర పాండియన్ సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది. నడువులా కొంజం పక్కా కనోమ్ సినిమాకు నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు, ఎడిసన్ అవార్డు, విజయ్ అవార్డు వచ్చింది. పిజ్జా సినిమాకు సైమా అవార్డు, బిగ్ ఎఫ్ఎమ్ ఎంటర్ టైనర్ మెంట్ అవార్డు వచ్చింది. సూద్ కవ్వుమ్ సినిమాకు విజయ్ అవార్డు అండ్ బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డు , ఇధార్కుథనే ఆసిపట్టై బాలకుమార సినిమాకు బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. ధర్మ దురై సినిమాకు నార్వే తమిళ్ ఫెస్టివల్ అవార్డు, ఏషియా విషన్ అవార్డు, విక్రమ్ వేధా సినిమాకు ఆనంద వికటన్ సినిమా అవార్డు, ఫిలిం ఫేర్, విజయ అవార్డు, సూపర్ డీలక్స్ సినిమాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్ బోర్న్ అవార్డు అందుకున్నాడు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇలా విజయ సేతుపతి ఒకసామాన్యుడి నుంచి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంత స్థాయికి రావడానికి అతను ఎదుర్కొన్నా పరిస్థితులు ఎన్నో. ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో విడుదల అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి విజయ్ సేతుపతి మంచి పేరు తీసుకురావాలని, అతని మరిన్ని చిత్రాలలో నటించి అతని జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి