విజ‌య్ సర్కార్‌ ఆడియో వేడుకకు భారీ ప్లాన్

356

త‌మిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా కాలా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఎంత అంగ‌రంగ‌వైభంగా చేశారో తెలిసిందే.. దీంతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ అభిమానులు ఎంతో ఆనందించారు.. ఇక కోలీవుడ్ లో కూడా సినిమా ఆడియో విడుద‌ల‌ల‌ను గ్రాండ్ గా చేయాలి అని చాలా మంది నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.. ముఖ్యంగాఇలా చేస్తే సినిమాకు హైప్ వ‌స్తుంది అని వారు భావిస్తున్నారు.

Image result for vijay sarkar posters

ఇటీవ‌ల‌ టాలీవుడ్‌లో లా.. మైదానాల్లో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో. ఇక యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్ థ‌నుష్ ఇలా వారి సినిమాల ఆడియో ఫంక్ష‌న్ లు భారీగా ప్లాన్ చేస్తున్నారు . ఇక త‌మిళ్ లో స్టార్ హీరోగా ఉన్న ఇలయ తలబది విజయ్ సినిమాల‌కు అక్క‌డ ఎంత క్రేజ్ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న న‌టించిన స‌ర్కార్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Image result for vijay sarkar posters

నెహ్రూ ఇండోర్‌ స్టేడియం లేదా ఇతర మైదానంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. టాప్ డైరెక్ట‌ర్ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో సినిమా డబ్బింగ్‌ పనులు తాజాగా ఆరంభమయ్యాయి…. ఇప్ప‌టికే వీరి కాంబోలో వ‌స్తున్న మూడ‌వ చిత్రం ఇది.. ఇక రెండు సినిమాలు గ‌తంలో సూప‌ర్ హిట్ అయ్యాయి..

Image result for vijay sarkar posters

ఈ సినిమా కూడా హిట్ టాక్ వ‌స్తుంది అని అభిమానులు భావిస్తున్నారు.దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబరులో ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది అని తెలుస్తోంది. ఇక్క‌డ ప్ర‌ధాన ఆక‌ర్ష‌న గా ఆస్కార్‌ వీరుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరిని ఏర్పాటు చేయ‌నున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.