విజయ్ దేవరకొండ నోటా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ ఎంతో చూడండి..

386

యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్న యంగ్ హీరో ఎవరంటే విజయ దేవరకొండ అనే చెప్పుకోవాలి.విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందం చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

nota కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలపై యువతలో మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇటీవల విడుదలైన నోటా ట్రైలర్ అదరగొడుతోంది.తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.నోటా చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

సంబంధిత చిత్రం

అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే మంచి బిజినెస్ చేస్తుంది.ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులకోసం 25 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు కనీసం 30 కోట్ల బిజినెస్ జరగాలని ప్లాన్ చేస్తున్నారట.చూడాలి మరి ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో.