బ్రేకింగ్: మరో ప్రముఖ హీరో,రాజకీయ నాయకుడి పరిస్థితి విషమం.. ఆందోళనలో అభిమానులు

420

కోలీవుడ్ సీనియర్ హీరో,తమిళనాట డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై అమెరికాలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తాజాగా విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఆందోళన ప్రారంభమయింది. డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్‌ను నిన్న రాత్రి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.ఈ విషయం తెలిసిన డీఎంకే కార్యకర్తలు హాస్పిటల్ దగ్గరకు వెళ్ళారంట.పార్టీ ఆఫీస్ కు వెళ్లి ఆయన గురించి సమాచారం తెలుసుకుంటున్నారు.అయితే ఇందులో నిజం లేదని డీఎంకే పార్టీ పెద్దలు అంటున్నారు.

Image result for విజయ్ కాంత్

ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని డీఎండీకే ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది కానీ.. అసలు ఏం జరిగింది..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయాలను మాత్రం ప్రకటించలేదు.తమిళనాట “నల్ల ఎంజీఆర్‌”గా అభిమానుల మన్ననలు అందుకున్న ఆయన.. ఇటీవలి కాలంలో అనారోగ్యంతోనే తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిదే. అయితే దాదాపుగా రెండు నెలల కిందటే ఆయన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. కరుణానిధి మరణం సమయంలోనూ ఆయన తమిళనాడులో లేరు. కరుణ మరణంపై తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Image result for విజయ్ కాంత్

అందులో కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం హఠాత్తుగా కురణానిధి స్మారకం వద్దకు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను మెరీనా వద్దకు తీసుకు వచ్చారు. నడవడానికే ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు పట్టుకుని మెల్లగా కరుణ స్మారకం వద్దకు తీసుకెళ్లారు. కరుణకు నివాళి అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.కాగా, విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుండడంతో పార్టీ స్పందించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరారని, నేడు డిశ్చార్జ్ అవుతారని స్పష్టం చేసింది.అంతేకానీ మరీ ఆరోగ్యం క్షీణించింది అన్న వార్త మాత్రం నిజం కాదని తెలిపింది. పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.విజయ్ కాంత్ గురించి ఆయన ఆరోగ్యం మీద వస్తున్న వదంతుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.