డిఫ‌రెంట్ క‌థ‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

385

ఇప్పుడు టాలీవుడ్ లోఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు అర్జున్ రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండదే… ఆ మ్యాన‌రిజం వాయిస్ డైలాగ్ డెలివ‌రీ అత‌నికి మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చాయి.. ఇప్పుడు వ‌రుస‌ చిత్రాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో…తాజాగా విజయ్ నటించిన గీత గోవిందం విడుదలకు సిద్ధంగా ఉంది. అంతలోనే విజయ్ మరో చిత్రాన్ని మొదలెట్టాశాడు.. కొత్త దర్శకుడు భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా డియర్‌ కామ్రేడ్ తెరకెక్కుతుంది.

Related image

 

ఈ టైటిల్ విని అంద‌రూ షాక్ అయ్యారు నిజంగా ఈ చిత్ర క‌థ ఏమిటి అని అంద‌రూ ఆలోచిస్తున్నారు ఇందులో ఆయ‌న పాత సినిమాలకు ఈ సినిమా స్టోరీ క‌థ‌కు చాలా డిఫ‌రెంట్ గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది… ఈ సినిమాలో సామాజిక బాధ్య‌త క‌లిగిన ఓ వ్య‌క్తిగా క‌నిపిస్తాడ‌ట విజ‌య్ .. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాలో ప్రారంభం అయింది.. ఇక చిత్రానికి బాణీలు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ అందిస్తున్నారు..సుజిత్‌ సారంగ్‌ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.