వైఎస్సార్ బయోపిక్ చిత్రం యాత్రలో జగన్ పాత్రకు విజయ్ దేవరకొండ?

324

ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల‌లో మంచి స‌క్సెస్ రేటున్న హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ మారాడు. ఆయ‌న చివ‌రి చిత్రం గీతా గోవిందం మంచి విజ‌యం సాధించ‌డంతో విజ‌య్ త‌దుప‌రి సినిమాల‌పై బోలెడ‌న్ని అంచ‌నాలు పెరిగాయి. విజ‌య్ ప్ర‌స్తుతం నోటా అనే బైలింగ్యువ‌ల్ మూవీతో పాటు డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ముందు మరో సూపర్ ఆఫర్ వచ్చి కూర్చుందట. అదేంటంటే ..

Related image

వైఎస్సార్ బయోపిక్ చిత్రం యాత్రలో జగన్ పాత్రకు ఈ యంగ్ హీరోను సంప్రదించినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న యాత్ర . మహి.వి రాఘవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. జగపతిబాబు , అనసూయ , పోసాని తదితర ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Image result for jagan vijay devarakonda

ఇప్పుడు జగన్ పాత్ర కోసం విజయ్ ను సంప్రదించారట.ఇంతకుముందు జగన్ పాత్రలో సూర్య నటిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత కార్తీ అనుకున్నారు కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ఈ ఆఫర్ విజయ్ దేవరకొండ ఓకే అంటాడో లేదో చూడాలి.