పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమా?

350

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటున్నారు.ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో కెరీర్ ప్రారంభించి… పెళ్లి చూపులు సినిమాతో స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు.ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది.దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బాగా డిమాండ్ పెరిగింది. 10 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నార‌ట‌.

Image result for vijay devarakonda geetha govindam images

ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈ చిత్రాలు ఉండగానే మరికొన్ని సినిమాలు చెయ్యడానికి విజయ్ పచ్చజెండా ఊపుతున్నాడు.అందులో ఒకటి పూరి జగన్నాథ్ సినిమా. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నాడ‌నే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఓ బడా నిర్మాత విజ‌య్ – పూరి కాంబినేష‌న్లో సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. విజ‌య్‌కి ఈ విష‌యం చెప్పార‌ట‌.

Image result for puri jagannath vijay devarakonda

అయితే త‌ను ప్ర‌స్తుతం ఓకే చెప్పిన సినిమాలు కంప్లీట్ కావడానికి రెండు సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.అందుచేత ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయిన త‌ర్వాత వ‌చ్చి క‌లుస్తాన‌ని చెప్పాడ‌ట‌.చూడాలి మరి పూరి అప్పటివరకు వెయిట్ చేస్తాడో లేదో.