ఎవడ్రా వాడు! ప్రణయ్ మరణం మీద విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

476

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు..అమృత తండ్రి మారుతీరావు, ఇతరులు పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే తన తండ్రిని ఉరి తీయాలని అమృత అంటుంది.రాజకీయ నేతలు, కుల సంఘాలు, సామాజిక వేత్తలు ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఓదార్చుతున్నారు. విచారణ సాగుతోంది.అయితే ఇప్పుడు ఈ విషయం మీద టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించాడు.ఆయన ఏమన్నాడో చూద్దామా.

Image result for vijay devarakonda

మిర్యాలగూడ ఘటన సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలను కూడా కదిలిస్తుంది.ఇప్పటికే ఈ విషయం మీద సింగర్ చిన్మయి,మంచు మనోజ్,హీరో రామ్ లాంటి వాళ్ళు స్పందించారు.కులం అనే జబ్బు వలన నిండు ప్రాణం పోయింది.సమాజం ఇంత డెవలప్ అవుతున్న ఇంకా కులం ఏంట్రా అని హీరో రామ్ గట్టిగానే స్పందించాడు.అలాగే మంచు మనోజ్ మాట్లాడుతూ మన అందరికీ ఒకే రకమైన గుండె, శరీరం ఉన్నాయి. ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ కులం పేరుతో, మతం పేరుతో వర్గాలుగా విడిపోవడం ఎందుకు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది?ఇలాంటి కుల పిచ్చి ఉన్న వారిని చూసి సిగ్గుపడుతున్నా అని తన ఆవేదనను తెలియజేశాడు.అయితే ఇప్పుడు ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు.ఆయన మాట్లాడుతూ..

Image result for pranay and amrutha

మనం ఏ లోకంలో బతుకున్నాం.ప్రజలలో చైతన్యం వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు.ఇంకా రాలేదని ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్థం అవుతుంది.మనం 20 వ సెంచరీలో ఉన్నాం.ఎన్నో ఏళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం పెట్టుకున్న కులాలను ఇప్పటికి కూడా ఇంత దారుణంగా పాటిస్తున్నారంటే బడా అనిపిస్తుంది.అన్ని కులాలు ఒకటే.ఈ విషయం అందరు అర్థం చేసుకోవాలి.పనుల కోసం కులం పుట్టింది తప్ప మనిషితో పాటే కులం పుట్టలేదు.మనిషి పుట్టగానే కులం అనేది పుట్టింది.కులం వలన మనుషులను చంపితే ఏమొస్తుందిరా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్పుడు నీరు కులం చంపినా వాడిని బతికిస్తుందా.అన్యాయం అయిపోయిన అమృతకు న్యాయం చేస్తుందా..కాబట్టి ఒక్కసారి ఆలోచించండి.ఇకమీద అయినా కులం అనే దానిని వదిలేయండి.ఇప్పటికైనా సమాజంలోని ప్రజలలో మార్పు వచ్చి ఈ కులపిచ్చిని వదిలేయాలని కోరుకుంటున్నా అని విజయ్ చెప్పాడు.విన్నారుగా మిర్యాలగూడ కుల వివక్ష హత్య మీద విజయ్ దేవరకొండ అన్న మాటలు.అతను చెప్పింది కూడా నిజమే కదా.సమాజం ఇంత డెవలప్ అవుతున్నా ఇంకా కులం మతం అనేవాటిని పట్టించుకుంటూపోతే చివరికి ఏమి మిగలదు కాబట్టి కులం అనే అడ్డు గోడల్ని పగలగొట్టి సంతోషంగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ హత్య గురించి అలాగే ఆ ఘటన గురించి విజయ్ దేవరకొండ అన్న మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.