విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ పెంచేశాడు..ఎంతనో తెలిస్తే నోరల్లబెడతారు..

447

ఏడాది కిందట విజయ్ దేవరకొండ ఒక మామూలు నటుడు. గత ఏడాది ఆగస్టులో విడుదల అయిన ‘అర్జున్ రెడ్డి’ అతడి జాతకాన్ని మార్చేసింది. అర్జున్ రెడ్డికి ముందు విజయ్ ‘పెళ్లి చూపులు’తో సూపర్ హిట్‌ను అందుకున్న హీరోనే.అయితే అర్జున్ రెడ్డి తర్వాత అతడి దశ తిరిగిపోయింది. ఆ సినిమా విజయం ఒక స్థాయిలో ఉండడంతో విజయ్ క్రేజ్ ఒకేసారి పెరిగిపోయింది.ఎంతలా అంటే విజయ్ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.

Related image

రీసెంట్ గా విడుదల అయిన ‘గీతగోవిందం’ మరో సంచలనంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసింది. కేవలం 14 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.ఇదిలా ఉంటే..ఇన్ని సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల రెమ్యూనరేషన్‌ను పెంచేశాడనే టాక్ వినిపిస్తోందిప్పుడు. ప్రస్తుతం విజయ్ ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలు రెండు చేస్తున్నాడు.

Image result for vijay devarakonda geetha govindam

వీటి తర్వాత ఒప్పుకుంటున్న తదుపరి సినిమాలకు ఈ హీరో ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ ను చార్జ్ చేస్తున్నాడనే టాక్ వస్తోంది. ఇందుకు అధికారిక ధ్రువీకరణ లేకపోయినా వరస విజయాలతో, యూత్‌లో బ్రహ్మాండమైన క్రేజ్‌ను సంపాదించుకున్న యువ హీరో ఆ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం పెద్ద విశేషం కాదేమో అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.