గీతగోవిందం 3 డేస్ కలెక్షన్స్ చూస్తే షాక్..

512

భారీ వసూళ్ల దిశగా సాగుతూ.. సూపర్ హిట్ అనిపించుకుంటోంది ‘గీతగోవిందం’. మూడు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. రూపకల్పనకు అయిన బడ్జెట్‌కు మించిన స్థాయిలో షేర్ వసూళ్లను రాబట్టింది ‘గీతగోవిందం’.

ఈ సినిమాను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించడంతో భారీగా లాభాలు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మరికొన్ని రోజులు గీతగోవిందం ప్రభంజనం ఉండబోతోంది. దీంతో దీని రూపకర్తలు కొన్ని కోట్ల రూపాయల లాభాలను పొందబోతున్నారని స్పష్టం అవుతోంది.

ప్రాంతాలవారీగా ఈ సినిమా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

నైజాం- రూ.5.01 కోట్లు
వైజాగ్ -రూ.1.34 కోట్లు
సీడెడ్ -రూ.2.01 కోట్లు
తూర్పు గోదావరి- రూ.1.09 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.0.97 కోట్లు
కృష్ణా- రూ.1.04 కోట్లు
గుంటూరు -రూ.1.20 కోట్లు
నెల్లూరు-రూ.0.44 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి మూడు రోజుల్లో రూ.13.1 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది ‘గీతగోవిందం’. కర్ణాటకలో రూ.1.04 కోట్లు, తమిళనాడులో రూ.0.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.01 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ సినిమా మొత్తంగా రూ.18.13 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టినట్టుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.