“గీత గోవిందం” కీలక సీన్స్ లీక్..షాక్ లో విజయ్ దేవరకొండ…

399

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా ఈ నెల 15 న విడుదలకు ముస్తాబవుతోంది..విజయ సరసన రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు..రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను బన్నీ వాసు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు..

అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని కొంతమంది స్టూడెంట్స్ గీతగోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలను షేర్‌ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసిన టెక్నికల్ టీంలోని ఓ వ్యక్తి ఆ సన్నివేశాలను కాపీ చేసి తన ఫ్రెండ్స్ కు పంపించటం జరిగింది. వాళ్ళు మరికొంతమందికి పంపించటం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సన్నివేశాలు షేర్ అవుతున్నాయి. పోలీసులు లీక్ చేసిన వ్యక్తులను విచారిస్తున్నారు.