మెగాస్టార్ టైటిల్ తో విజయ్ దేవరకొండ?

258

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ మధ్యనే విడుదల అయినా టాక్సీవాలా కూడా హిట్ అవ్వడంతో మనోడికి అదృష్టం గమ్ పట్టినట్టు పట్టింది అని అనుకుంటున్నారు..

Image result for vijay devarakonda

ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.విజయ్ దేవరకొండ తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు.నోటా సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చాడు.వరుస విజయాలతో దూసుకుపోతు అగ్ర హీరోల టాప్ టెన్ లో విజ‌య్ స్థానం ద‌క్కించుకున్నాడు.ఈ విషయాలన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీ సినిమా టైటిల్ ను విజయ్ పెట్టుకుంటున్నాడంట.

మెగాస్టార్ టైటిల్

చిరంజీవి నటించిన హీరో చిత్రం 1984లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ టైటిల్ పై విజయ్ దేవరకొండ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాత చిత్రాల టైటిల్స్ ని రిపీట్ చేస్తే ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. గతంలో చాలా మంది హీరోలు పాత చిత్రాల టైటిల్స్ తో సినిమాలు చేశారు. .విజయ్ దేవరకొండ తమిళంలో మరోక సినిమా చేస్తున్నాడు.. డ్రీమ్ వారియర్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. శ్రీకార్తిక్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రచారంలో ఉన్న హీరో టైటిల్ ఈ చిత్రం కోసమేనా అనేది తేలాల్సి ఉంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.