పరీక్ష పేపర్‌లో విజయ్ దేవరకొండ పేరు.. ఆనందంలో అభిమానులు

308

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలతో మాంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.ఆయన క్రేజ్ ఎలా ఉందంటే విజయ్ పేరు ఏకంగా పరీక్షా పత్రాలలో కూడా వచ్చేసింది.

Image result for vijay devarakonda

అతని మీద ఏకంగా ఒక క్వశన్ ను అడిగారు. విజయ్ పేరు పరీక్ష పేపర్‌లోనూ ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక విజయ్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్‌గా షేరవ్వుతున్న ఈ పరీక్ష పేపరు.. ఓ ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించినదిగా తెలుస్తోంది. అయితే, ఇది ఏ అర్హత పరీక్షకు సంబంధించందనే వివరాలు తెలియరాలేదు.

Image result for vijay devarakonda name on exam question

ఇందులోని 8వ ప్రశ్నలో Vijay Devarakonda has been________ since his blockbuster movie ‘Arjun Reddy’. అని ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత మంచి క్రేజ్ సంపాదించాడు అనే విషయాన్ని ఇంగ్లీషులో ఏ విధంగా చెబుతారనేది ఆ ఖాళీలో పూరించాలి. మరి ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో.