పక్క రాష్టాలలో దుమ్ము దులుపుతున్న విజయ్ దేవరకొండ..

398

‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పక్క భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమాను తెలుగు వారితో పాటు తమిళులు, కన్నడీగులు కూడా చూసేశారు. ప్రస్తుతం ఆయా భాషల్లో ఆ సినిమా రీమేక్ అవుతోంది కూడా. ఇప్పటికే విజయ్ దేవరకొండ తమిళంలో ఒక సినిమాకు సైన్ చేసేశాడు.

Image result for vijay devarakonda

‘నోటా’ పేరుతో తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది. అందులో విజయ్ హీరోగా నటిస్తున్నాడు.విజయ్ తాజా సినిమా ‘గీతగోవిందం’ కూడా పక్క రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు రాబడుతుంది.కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, బెంగళూరుల్లో గీతగోవిందం సినిమాకు మంచి వసూళ్లున్నాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది.

Image result for vijay devarakonda nota images

ఇక తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్ ప్రాంతంలో ‘గీతగోవిందం’ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా విజయ్ ‌కి మంచి మార్కెట్ కనిపిస్తోంది.ఈ సినిమా అక్కడ కూడా హిట్ అయ్యింది కాబట్టి విజయ్ తమిల్ లో చేస్తున్న ‘నోటా’ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.