పబ్లిక్ మీటింగ్స్ పెట్టబోతున్న విజయ్ దేవరకొండ..ఎందుకో చూడండి

332

విజ‌య్ దేవ‌ర‌కొండ‌,మెహ్రీన్ నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా ‘నోటా’.ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ రావటంలో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ‘‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’’ లాంటి సంచ‌ల‌న సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తోన్న సినిమా కావటంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘నోటా’ విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందించారు.

Image result for nota movie

పొలిటికల్ జోనర్‌లో రూపొందిన సినిమా కావడంతో..అటు యూత్‌తో పాటు.. ఇతర వర్గాల సినీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఆసక్తిని రేపుతోంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు దీని రూపకర్తలు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు పబ్లిక్ మీటింగ్స్ అని పేరు పెట్టినట్టుగా సమాచారం.

Related image

పొలిటికల్ జోనర్ సినిమా కాబట్టి.. ఈ రకంగా పబ్లిసిటీ కార్యక్రమాలను ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. ఈ నెల 30న విజయవాడలో నోటా ‘పబ్లిక్ మీటింగ్’ జరగబోతోందని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో మరో పబ్లిక్ మీటింగును నిర్వహించనున్నారట. మొత్తానికి సినిమాకు తగ్గట్టైన రీతిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా ఉన్నారు.