విజయ్ దేవరకొండ వీడియో వైరల్.. చూస్తే షాక్

246

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ మధ్యనే విడుదల అయినా టాక్సీవాలా కూడా హిట్ అవ్వడంతో మనోడికి అదృష్టం గమ్ పట్టినట్టు పట్టింది అని అనుకుంటున్నారు.. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.

పాల బుగ్గలతో

విజయ్ దేవరకొండ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది నువ్విలా చిత్రంతో అనుకుంటే పొరపాటే. విజయ్ దేవరకొండ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ టివి సీరియల్ లో నటించాడు. ఆ సీరియల్ కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన ఆ సీరియల్ పేరు షిరిడి సాయి పర్తి సాయి దివ్య కథ.

‘చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్’ అంటూ విజయ్ దేవరకొండ ముద్దు ముద్దుగా డైలాగులు చెబుతున్నాడు. ఉపాధ్యారాలు తన విద్యార్థులకు పుట్టపర్తి మహత్యాన్ని వివరించే సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది.నేను కూడా ఈ వీడియోని రిపీట్ గా చూస్తున్నా. ఈ వీడియో ఎవరు బయటకు తీశారో కానీ.. నాకు, మా అమ్మకు ఈ రోజు గుర్తుంది పోయేలా చేశారు అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.