విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ‘దొరసాని’. హీరోయిన్ ఎవరో తెలుసా?

313

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.తను ఫాంలో ఉన్నపుడే తమ్ముడిని కూడా పరిచయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

Vijay Deverakonda’s brother Anand Deverakonda debut movie details

ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించబోతున్నారు.పెళ్లి చూపులు సహ నిర్మాత, విజయ్ దేవరకొండ బంధువు యష్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా ద్వారా జీవిత-రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది.

Related image

ఈ సినిమాకు ‘దొరసాని’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, అక్టోబర్ 10న సినిమా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.తెలంగాణ విలేజ్ ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగుతుందంట.ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కొన్ని రోజులుగా యాక్టింగ్ వర్క్ షాపులో పాల్గొంటూ సినిమా కథకు తగిన విధంగా తెలంగాణ స్లాంగ్, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.