హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ…చిత్రం పేరేమిటో తెలుసా..

353

టాలీవుడ్ లో యాట్యుట్యూడ్ వలన ఫేం అయినా హీరో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ అనే చెప్పుకోవాలి.అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.రౌడి బ్రాండ్స్ అనే బట్టల బ్రాండ్ ను కూడా ఈ మద్య స్టార్ట్ చేశాడు.ఇప్పుడు తన తమ్ముడిని సెటిల్ చేసే పనిలో ఉన్నాడు విజయ్. విజయ్ తమ్ముడు ఆనంద్ ను టాలీవుడ్‌కు పరిచయం చెయ్యబోతున్నాడు.

కేవీ మహేంద్ర దర్శకత్వం వహించే చిత్రంలో ఆనంద్ దేవరకొండ నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతలు యశ్ రంగినేని, మధుర శ్రీధర్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దొరసాని అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.