విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ..

270

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ మధ్యనే విడుదల అయినా టాక్సీవాలా కూడా హిట్ అవ్వడంతో మనోడికి అదృష్టం గమ్ పట్టినట్టు పట్టింది అని అనుకుంటున్నారు.. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.

Image result for vijay devarakonda

విజయ్ దేవరకొండ తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు.నోటా సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని విజయ్ గతంలో తెలిపాడు.

Image result for vijay devarakonda

తాజా సమాచారం ప్రకారం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ బాలీవుడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేస్తారట. అంటే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి నేరుగా హీరోగా కాకుండా అతిథిగా పరిచయం కాబోతున్నాడు. విజయ్ దేవరకొండ అతిధిగా మెరవబోయే ఆ బాలీవుడ్ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.