పబ్లిక్‌లోకి జంటగా వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక!

259

‘గీతగోవిందం’ తో ఈ మధ్యనే హిట్ కొట్టారు విజయ్ దేవరకొండ మరియు రష్మిక.వీరిద్దరూ ప్రస్తుతం కూడా ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. అదే ‘డియర్ కామ్రేడ్’. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గీతగోవిందంగా ఆకట్టుకున్న వీళ్లు డియర్ కామ్రేడ్‌గా అలరిస్తారనే అంచనాలున్నాయి.

Related image

ఇక ‘దేవదాస్’ విజయవంతం కావడంతో రష్మిక కెరీర్‌కు మరింత ఊపు వస్తోంది. యంగ్ స్టార్ హీరోల సరసన ఈమెకు అవకాశాలు దాదాపు ఖరారు అయినట్టే. మరోవైపు విజయ్ దేవరకొండ ‘నోటా’ విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

vijay,rashmika inaugurate a fashion mall

ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ హిట్ పెయిర్ తాజాగా పబ్లిక్‌లో జంటగా కనిపించింది. ఒక షాప్ ఓపెనింగ్‌కు వీరిద్దరూ జంటగా వచ్చారు. ఇప్పటికే జంటగా ఒక సూపర్ హిట్‌ను కొట్టిన వీళ్లు పబ్లిక్‌లో అలా కనిపించడంతో అభిమానులు ఉర్రూతలూగారు. ఈ క్రేజీ హీరో, క్రేజీయెస్ట్ హీరోయిన్‌ను చూడటానికి ఎగబడ్డారు.