అభిమాని కోసం ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేసిన విక్ట‌రీ వెంక‌టేష్

246

విక్ట‌రీ వెంక‌టేష్ బ‌య‌ట పార్టీల‌ల‌లో కూడా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తూ కేవ‌లం సినిమాలే త‌న పాష‌న్ గా ఉంటారు.. ఇక ఆయ‌న కుటుంబాన్ని కూడా పెద్ద‌గా బ‌య‌ట ఫంక్ష‌న్ల‌కు తీసుకురారు. అయితే సినిమాల‌లో ఫ్యామిలీ హీరోగా లేడీ ఫ్యాన్స్ ని ఆయ‌న ఎంద‌రినో సంపాదించుకున్నారు, ఎలాంటి సినిమా క‌థ‌కు అయినా ప్రాణం పోస్తారు విక్ట‌రీ వెంక‌టేష్.

Image result for VENKATESH

ప్ర‌ముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సురేశ్ అనే అభిమాని క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంకటేశ్.. హైదరాబాద్‌ ఎల్బీనగర్ సమీపంలోని మంసూరాబాద్‌లో ఉన్న అతడి ఇంటికెళ్లారు. సురేశ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్న వెంకీ.. అతడితో ఆప్యాయంగా మాట్లాడారు. సురేశ్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన వెంకటేష్.. వారికి ధైర్యం చెప్పారు. అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వెంకటేశ్ అభిమానిని పలకరిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

లివర్ క్యాన్సర్ కారణంగా సురేశ్ కొంత కాలంగా మంచానికే పరిమితమయ్యారు. వెంకటేశ్‌ను అమితంగా ఇష్టపడే ఆయన.. ఎల్బీ నగర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వెంకీ నటించిన ప్రతి సినిమాను వదలకుండా సురేశ్ చూసేవారు.. వెంకటేశ్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామా సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో ఇటీవలే పూర్తయ్యింది. నగరానికి వచ్చిన వెంటనే తనను చూడాలన్న అభిమాని కోరికను నెరవేర్చారు. సురేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మ‌రి చూశారుగా వెంక‌టేష్ మంచి మ‌నసు, మ‌రి వెంకీ చేసిన ప‌నిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.