వెంకీ మల్టి స్టారర్ ఈ సారి తమిళ స్టార్ హీరోతో..

405

టాలివుడ్ లో మల్టి స్టారర్ ల హవా నడుస్తోంది…టాలివుడ్ జక్కన్న రాజమౌళి తారక్ చెర్రీ లతో ఒక సినిమా రూపొందించడానికి సిద్దమవుతున్నారు..మరో పక్క విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2, మరోటి అల్లుడు నాగచైతన్య తో కలిసి వెంకీ మామ అనే మల్టి స్టారర్ మూవీస్ లో నటిస్తున్నాడు..తాజాగా మరో క్రేజీ మల్టి స్టారర్ కు సంబందించిన అప్ డేట్ ఒకటి వచ్చింది..ఇప్పటికే ఎన్నో మల్టిస్టారర్ సినిమాల్లో నటించి ఒక ట్రెండ్ ను సృష్టించిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక హీరో…

రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఈసారి వెంకటేష్ ఒక తమిళ్ స్టార్ తో జట్టు కడుతుండడం విశేషం. సూర్య తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. సూర్య ఈ సినిమాలో 20 నిముషాల పాత్రలో కనిపిస్తాడట. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ మల్టిస్టారర్ ను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై D. సురేష్ బాబు నిర్మిస్తారట. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెంకటేష్ – సూర్య ఇద్దరూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించడం. ఎలాగూ సూర్య ఉంటాడు కాబట్టి ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ కావడం ఖాయం. అంటే లేటుగా అయినా వెంకటేష్ కోలీవుడ్ కు లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నట్టే.