రోజా’ను వదులుకోవడానికి కారణం చెప్పిన విక్ట‌రీ వెంక‌టేష్

397

ఈ సంక్రాంతికి మ‌ల్టీ స్టార‌ర్ సంద‌డి క‌నిపించ‌నుంది ముఖ్యంగా ఇప్పుడు ఇదే సినిమా గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు ఇంత‌కీ ఏమిటి ఈ సినిమా అనుకుటున్నారా….విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కేరీర్ మొదలు పెట్టి ముప్పయ్యేళ్లు అయిపోయిందని.. ఒక దశ తర్వాత అది మల్టీస్టారరా? సోలో సినిమా అని ఆలోచించడం మానేస్తామన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రోజా సినిమా విషయమై ఆయన మాట్లాడుతూ… ‘‘చాలాసార్లు మన దగ్గరికి వచ్చిన మంచి కథల్ని చేయలేం. ‘రోజా’ సినిమాని నేను చేయాల్సింది. అప్పట్లో చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. అది చేసుంటే హిందీవైపు వెళ్లి అక్కడే బిజీ అయ్యేవాణ్నేమో. కానీ అది చేయలేకపోయానే అని బాధపడలేదు. ఆ సినిమా చేయకపోవడంతో ‘సుందరకాండ’తోపాటు వరుసగా కుటుంబ కథలు చేసే అవకాశం వచ్చింది. ‘రోజా’ చేసుంటే ఈ ఇవి చేసేవాణ్ని కాదు కదా. ‘బాహుబలి’ చేయాలని నాకూ ఉంటుంది. అమితాబ్‌ ‘బ్లాక్‌’, ఆమిర్‌ఖాన్‌ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా మనమూ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఆ అవకాశం రావాలి. నాకెందుకు రాలేదని ఆలోచిస్తూ కూర్చుంటే అసలేమీ చేయలేం’’ అని పేర్కొన్నారు. మ‌రి విక్ట‌రీ వెంక‌టేష్ అందుకే ఫ్యామిలీకి ద‌గ్గ‌ర అయి హీరోగా పేరు తెచ్చుకున్నారు… సింపిల్ సిటీకి టాలీవుడ్ లో బ్రాండ్ గా ఉంటారు, కాంట్రావ‌ర్సీలకు దూరం, ఎవ‌రికితో ఎక్కువ‌గా మాట్లాడ‌రు అది ఆయ‌న పై మ‌రింత అభిమానం ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు పెరిగింది అని చెప్పాలి… మరి వెంకీ స్టేట్ మెంట్ పై మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.