వెంకటేష్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్

388

సినిమాల్లో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తూ బ‌య‌ట ఫంక్ష‌న్లు పార్టీల‌కు కుటుంబంతో ఎక్కువ‌గా రారు విక్ట‌రీ వెంక‌టేష్ సింపుల్ గా ఉండే ఈ హీరో పెద్దగా బ‌య‌ట‌కు క‌నిపించరు అందుకే ఫ్యామిలీ హీరోగా వెంక‌టేష్ కు క్రేజ్ ఉంది. విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డితో మార్చి 24న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ పాల్గొన్నారు.

వినాయక్ రెడ్డి తాత, రామసహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పెళ్లి అనంతరం… దగ్గుబాటి కుటుంబం, రామసహాయం ఫ్యామిలీ ఫోటోస్ విడుదలయ్యాయి.
నూతన దంపతులు ఆశ్రిత, వినాయక్. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఆశ్రిత వినాయక్ మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. స్నేహ బంధం ప్రేమ బంధంగా మారడంతో… చివరకు వైవాహిక బంధం వైపు అడుగులు వేశారు.

Image result for venkatesh daughter marriage

వెంకీ కూతురు అత్తగారి ఫ్యామిలీ ఇదే ఆశ్రిత అడుగు పెట్టబోయే కొత్త ఫ్యామిలీ ఇదే. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులను ఈ ఫోటోలో చూడొచ్చు. పెళ్లి వేడుక సందర్భంగా దగ్గుబాటి కుటుంబమంతా ఒకే ఫ్రేములోకి వచ్చారు. సురేష్ బాబు, వెంకటేష్, నాగ చైతన్య తల్లి లక్ష్మి, రానా, అభిరామ్, చైతు-సమంత దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.ఆశ్రిత ప్రొఫెషనల్‌ బేకర్‌, ఫుడ్‌ బ్లాగర్‌. పెళ్లి తర్వాత కూడా ఆమె దీన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది.ఇక అశ్రిత కుటుంబం కూడా హైద‌రాబాద్ లోనే ఉంటుంది అని, పెళ్లి త‌ర్వాత త‌న ఫ్రొఫెష‌న్ తను కొన‌సాగిస్తుంద‌ట‌.. ఇక ఈ వెడ్డింగ్ కు సినీతార‌లు అంద‌రూ త‌ర‌లి వ‌చ్చారు, వెంక‌టేష్ కు బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో మంచి స‌న్నిహితులు ఉన్నారు వీరు అంద‌రూ కూడా పెద్ద ఎత్తున ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. ఇక హైద‌రాబాద్ లో కూడా ఫంక్ష‌న్ ఏర్పాటు చేసి ఇక్క‌డ పారిశ్రామిక వేత్త‌లు రాజ‌కీయ సినీరంగానికి చెందిన అతిధుల‌ను ఆహ్వ‌నిస్తున్నార‌ట‌. మొత్తానికి ఈ వెడ్డింగ్ ఇటు ద‌గ్గుబాటి కుటుంబంలో నూత‌న ఆనందం వెల్లివిరిసేలా చేసింది అని చెప్పాలి. మ‌రి మీరు కూడా ఈ కొత్త జంట‌కు మీ విషెస్ ని అందించండి.