నాని విక్రమ్ సినిమాలో ఏకంగా ఆరుగురు హీరోయిన్స్?ఎవరెవరో చూడండి

249

నాని ప్రతి ఏడాది 4 సినిమాలను రిలీజ్ చేస్తాడని మన అందరికి తెలిసిందే. వచ్చే ఏడాది కూడా నాలుగు చిత్రాలను రిలీజ్ చేసేందుకు ఇప్పటినుంచే ప్లాన్ వేస్తున్నాడు. ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.. భారీ అంచనాలున్న ‘జెర్సీ’ మూవీ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జెర్సీ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో మూవీని నాని మొదలు పెట్టబోతున్నాడు.

Image result for nani vikram kumar

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే. నాని కోసం తనదైన శైలిలో విభిన్నమైన స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నాని ఆడవారి సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తాడని మొదటి నుండే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..

Image result for nani vikram kumar

అయితే ఈ సినిమాలో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా ఆరుగురు హీరోయిన్స్‌ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్యాయంకు గురైన ఆడవారి పాత్రల్లో ప్రముఖ హీరోయిన్స్‌ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయిదుగురు హీరోయిన్స్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా, మరో హీరోయిన్‌ మాత్రం నానితో రొమాన్స్‌ చేయనుందట. ఆ అయిదుగురు హీరోయిన్స్‌తో నానికి సినిమాలో కెమెస్ట్రీ ఉండదట. వారి పక్షాన పోరాడేందుకు మాత్రమే నాని పాత్ర ఉంటుందట. మొత్తానికి నాని మూవీలో ఆరుగురు హీరోయిన్స్‌ ఉండబోతున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.అయితే ఆ ఆరుగురు హీరోయిన్స్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. త్వరలో తెలియజేసే అవకాశాలు ఉన్నాయి.