వెంకీమామకు జోడిలుగా వీళ్ళే

202

ఎఫ్‌ 2 సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్‌, మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ నటించనున్న వెంకీ మామ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు బాబీ దర్శకుడు.జై లవకుశ తర్వాత బాబీ తీస్తున్న సినిమా ఇదే.ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

Image result for venkymama

అయితే ఇందులో ఒక హీరోయిన్ ను ఒకే చేశారు. ఈ మూవీలో మొదటగా హ్యూమా ఖురేషీని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ పాత్రకు శ్రియాను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు సుభాస్‌ చంద్రబోస్‌, గోపాల గోపాల సినిమాలతో సందడి చేశారు.

Image result for venky shriya

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రకుల్‌ ప్రీత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని టాక్ వస్తుంది.ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. షూటింగ్‌ను మాత్రం ఇంకా ప్రారంభించలేదు.