వెంకీ- త్రివిక్రమ్ మూవీ ఖరారు..పవన్ కథనే వెంకీతో తీయబోతున్న త్రివిక్రమ్..

360

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెంకీ త్రివిక్రమ్ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది.వినోదాన్ని పండించడంలో ఆరితేరిన వెంకీ కామెడీ ఎంటర్‌టైనర్స్ తీయడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం మల్టీస్టారర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న వెంకటేశ్ ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

Image result for venky trivikram

‘అరవింద సమేత’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ పక్క జరుగుతుండగానే ఇటీవల వెంకీని కలిసిన త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడట. విశేషం ఏమంటే ఇది త్రివిక్రమ్ పవన్ కోసం రాసుకున్న కథట! గతంలో పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ రాసుకున్న కథనే వెంకీకి వినిపించినట్టు తెలుస్తోంది.నిజానికి ఈ సినిమాను పవన్ చెయ్యాల్సింది కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఇకపై సినిమాలు చెయ్యను అని ప్రకటించాడు.అందుకే ఈ కథను వెంకీతో చెయ్యనున్నాడు త్రివిక్రమ్.

Image result for venky trivikram

గతంలో వెంకటేశ్ నటించిన ‘‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు’’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించాడు. అందులో మొదటి రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘అరవింద సమేత’ చిత్రం విడుదల కాగానే త్రివిక్రమ్.. వెంకీ సినిమానే టేకప్ చేస్తారని తెలుస్తోంది. దీనిని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.