వెంకీ మామకు మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ఫిక్స్

392

సీనియ‌ర్ హీరో వెంకీ సినిమాలు ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల‌కు ధీటుగా తీస్తున్నారు…. ఇక తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ అలాగే నాగ‌చైత‌న్య క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నారు.. ఈ సినిమాకు జై ల‌వ‌కుశ ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు… ఈ సినిమా టైటిల్ వెంకీ మామ అని ఫైన‌ల్ అయింది.

Image result for వెంకీ మామ

మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా ఇది తెర‌కెక్క‌నుంది…. ఈ సినిమాని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి తాజాగా బాణీలు స‌మ‌కూర్చేందుకు సంగీత ద‌ర్శకుడు ఫిక్స్ అయ్యారు అని తెలుస్తోంది.

Image result for devi sri prasad

ఇక ఈమూవీకి ముందు దేవీశ్రీ ప్ర‌సాద్ ను తీసుకుందామ‌ని అనుకున్నారు …కాని ఆయ‌న వేరే చిత్రాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ సినిమాకు త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్యకు జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్నారు.. వెంకీకి జోడిగా హ్యూమా ఖురేషి లేదా శ్రియ‌లో ఒక‌రిని ఫైన‌ల్ చేస్తారు అని తెలుస్తోంది. ఈ సినిమా కామెడీతో కూడుకున్న చిత్రం.. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి..