‘ఎఫ్2’ ఫ‌స్ట్‌లుక్ విడుదల..సంప్రదాయ దుస్తులలో అలరించిన వెంకీ వరుణ జంట..

278

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ కాంబినేషన్‌లో వస్తోన్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ట్యాగ్ లైన్. వెంకటేశ్ సరసన తమన్నా, వ‌రుణ్ తేజ్‌కు జంటగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Image result for f2 telugu movie poster

హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ‘ఎఫ్2’ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే, దీపావళి పండుగను పురష్కరించుకుని ‘ఎఫ్2’ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

Image result for f2 telugu movie poster

ఈ ఫస్ట్‌లుక్ చాలా సింపుల్‌గా ఉంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌ మోడరన్ లుక్‌లో ఉన్న సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అంతేకాకుండా ‘వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్లు’ అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు.పోస్టర్ చూస్తుంటే దిల్ రాజు సినిమా అంటే ఇలాగే ఉంటుంది అని అభిమానులను అనిపించేలా ఉంది.పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.