వరుణ్ తేజ్ అంతరిక్షం తొలిపాట ‘సమయమ’ విడుదల రేపే ..

273

ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో హిట్స్ అందుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అంతరిక్షం. ’9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Image result for antariksham telugu movie

తెలుగు ఇండస్ట్రీలో తొలి స్పేస్ నేపథ్యం ఉన్న సినిమా ఇదే కావడం విశేషం. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు.

Related image

ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలోని ‘సమయమ’ పాటను నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.