హరీష్ శంకర్ వరుణ్ తేజ్ మూవీ స్టార్ట్.. పేరేంటో తెలుసా?

183

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ గా పిలవబడుతున్న ఈ యంగ్ హీరో అన్ని ప్రయోగ సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే కంచె అంతరిక్షం వంటి ప్రయోగాలతో పాటు ముకుంద, ఫిదా,తొలిప్రేమ, ఎఫ్2 వంటి కమర్షియల్ సినిమాలు కూడా తీస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరొక ప్రయోగం చెయ్యబోతున్నాడు.

Image result for harish shankar varun tej

వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌ లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వాల్మీకి అనే పేరు పెట్టారు. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్‌ గా పేరుపొందిన హరీష్ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట.

Image result for varun tej harish shankar

ఒరిజినల్‌ వర్షన్‌లో సిద్ధార్థ్‌ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ‘వాల్మీకి’ షూటింగ్ జనవరి 27 ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవంలో మొదటి షాట్‌కి మెగా డాటర్ నిహారిక క్లాప్ కొట్టగా.. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.