వరుణ్ తేజ్ సంకల్ప్ ల “అంతరిక్షం” ఫస్ట్ లుక్ విడుదల..

354

మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ వరుస హిట్లతో మాంచి జోష్ మీద ఉన్నాడు..వరుణ్ ప్రస్తుతం ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమాను చేస్తున్నాడు..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు అంతరిక్షం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్..సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా కోసం వరుణ్‌ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ చిత్రం లో వరుణ్‌ తేజ్ సరసన అదితి రావు జోడీకడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.