మళ్ళి మెగా హీరోనే నమ్ముకున్న హరీష్ శంకర్..హీరోయిన్ గా రష్మిక..

273

హరీష్ శంకర్ టాలెంట్ ఉన్న దర్శకుడే కానీ అంతలా అదృష్టము లేని దర్శకుడు.పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి ఇండస్ట్రీకి తన సత్తాను చాటాడు. ఆ తర్వాత మెగా హీరోలను నమ్ముకుని సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసి హిట్ కొట్టాడు.కానీ ఎన్నో అంచనాలతో వచ్చిన అల్లు అర్జున్ తో తీసిన డీజే అట్టర్ ప్లాప్ అయ్యింది.దాంతో మనోడి పరిస్థితి మరి దారుణంగా అయ్యింది.

Image result for harish shankar varun tej

అయితే ఇప్పుడు హిట్ కోసం మళ్ళి మెగా హీరోనే నమ్ముకున్నాడు.అతను త్వరలో వరుణ్ తేజ్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.నాలుగేళ్ళ క్రితం తమిళంలో జిగర్తాండ అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించారు. అద్భుతమైన పాత్రలతో ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for varun tej rashmika

ఈ సినిమానే హరీష్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించనుంది.వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకతంలో అంతరిక్షం సినిమాలో అలాగే అనిల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్2 చిత్రంలో నటిస్తున్నాడు.ఆ చిత్రాల తర్వాత ఇది పట్టాలెక్కనుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు తెలియాల్సి ఉంది.