‘బిగ్ బాస్’ హౌస్‌లో వరుణ్ – వితిక రొమాన్స్.. కెమెరాకు కనిపిస్తున్నామంటూ…

503

‘రియాలిటీ షోలందు బిగ్ బాస్ షో వేరయా’ అన్నట్టుగా దేశంలో నలుమూలలా విస్తరిస్తోంది బిగ్ బాస్ రియాలిటీ షో. బుల్లి తెర ప్రేక్షకుల్ని గత రెండు సీజన్లుగా అలరిస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్‌కి ఎంట్రీ ఇచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం రాత్రి (జూలై 21) 9 గంటలకు స్టార్ మాలో ప్రారంభమైంది. 2006లో హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. 2019 నాటికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా అవతరించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విస్తరించింది.

Bigg Boss 3: బిగ్‌బాస్ 3లో అత్యధిక పారితోషకం అందుకుంటున్నది ఎవరో తెలుసా..

బిగ్ బాస్ సీజన్ 3ని బాధ్యతల్ని తీసుకున్నారు కింగ్ నాగార్జున. ‘మనసు కోతి లాంటిది.. మరి అలాంటి మనసున్న కొంతమంది మనుషులు ఒక ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం నింపే శక్తిగల వ్యక్తి ఎవరు?.. అతను ఎవరో కాదు.. నేనే’ మీ కింగ్ నాగార్జున అంటూ బుల్లితెరపై సందడి చేసేందుకు వచ్చేశారు హోస్ట్ నాగార్జున’బిగ్ బాస్’ ఎక్కడెక్కి నుంచో వచ్చిన పలువురు సెలెబ్రిటీలు.. వాళ్ల మధ్య మానసికంగా, శారీరకంగా జరిగే సంఘర్షణ. వంద రోజుల పాటు తమను, తమ క్యారెక్టర్‌ను కాపాడుకుంటూ వచ్చి, విజేత అవ్వాలనే తపన.. ఆ సమయంలోనే తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. అన్నీంటిని కళ్లకు కట్టినట్లు చూపించే షో. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ కూడా గత ఆదివారం ప్రారంభమైంది. ఈ షోలో మొదటి రెండు రోజులు చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Related image

బిగ్‌బాస్ హౌస్‌లో ఆట మొద‌లైంది. ఎవ‌రు ఎలాంటి వారో, వారి మ‌న‌స్త‌త్వాలు ఏమిటో, మూడో కంటి ద్వారా బ‌హిర్గ‌త‌మౌతోంది. వంద‌రోజుల పాటు ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటూ విజేతగా నిలవాల‌నే ప్ర‌య‌త్నంలో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతుంటారు హౌస్‌మేట్స్‌. తోటి వారిని ఇంటి నుంచి గెంటి వేసే కుట్ర‌లు, కుతంత్రాల‌కు తెర లేచింది. న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తుంది గానీ.. అందులో ఎంతో అర్థం ఉంటుంది. ఎప్పుడెప్పుడు హౌస్ నుంచి బ‌య‌టికి నెట్టేద్దామా అనే క‌సి ఆ న‌వ్వులో ద‌ర్శ‌న‌మిస్తుంది.100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ‘బిగ్ బాస్’ షోకు వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక షేరు ఒకేసారి అడుగు పెట్టారు. ప్రారంభోత్సవం రోజు మొదటి 13 మంది కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలిచిన హోస్ట్ నాగార్జున.. చివరి ఇద్దరు అంటే వరుణ్, వితికలను జంటగా ఆహ్వానించాడు. షో చరిత్రలోనే భార్యభర్తలు ఎంటర్ కావడం తొలిసారి అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రింద వీడియోని చూడండి

స్టేజ్‌పై వీళ్ల ప్రేమకథను అడిగారు నాగార్జున. దీనికి వితిక సమాధానం చెప్పింది. ‘‘మేమే ఓ సినిమా షూటింగ్ సమయంలో కలిశాం. కానీ, ఇద్దరం మూడు నెలలు మాట్లాడుకోలేదు. కానీ, మలేషియా షెడ్యూల్ వెళ్లినప్పుడు ప్రపోస్ చేశాడు. పెళ్లి చేసుకునేటట్లు ఉంటేనే ప్రేమించుకుందాం అని చెప్పాను. తర్వాత ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం” అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నాగ్‌కు హగ్ ఇచ్చి వెళ్లబోయారు. కానీ, ఆయన.. వితికను ఎత్తుకుని వెళ్లమని వరుణ్‌కు చెప్పాడు. దీంతో వరుణ్ ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది.

Image result for bigg boss 3 telugu varun sandesh and his wife romance

నామినేషన్ నుంచి బయట పడేందుకు ఈ ఇద్దరూ తమ బదులు ఎవరి పేర్లను చెప్పాలా అన్న విషయాన్ని కూడా రహస్యంగా మాట్లాడుకున్నారు. తన బదులు హిమజను నామినేట్ చేయాలని అనుకుంటున్నానని వితికా భర్తకు చెప్పింది. అయితే, ఆ అమ్మాయి మంచిదని వద్దని వరుణ్ సూచించాడు. ఇక, తనైతే డైలమాలో ఉన్నానని.. తనను తానే నామినేట్ చేసుకుంటానేమోనని భార్యతో చెప్పాడు. కానీ, వరుణ్.. పునర్నవిని నామినేట్ చేశాడు.

Image result for bigg boss 3 telugu varun sandesh and his wife romance

వితిక ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లింది ఆ సమయంలో స్లీపింగ్ రూమ్‌లో ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకున్నాడు. ఇక గదిలో ఎవ్వరూ లేరు. అప్పుడు ముచ్చట్లు పెట్టుకుని భార్యభర్తలు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వీరి కౌగిలింతలు బిగ్ బాస్ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. అప్పుడు.. కెమెరా ఇటే చూస్తుంది అని వితిక అనడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లో వరుణ్ సందేశ్ వితిక ల రొమాన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..