మరో సంచలనానికి తెరలేపిన వర్మ..

368

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంతో మీడియా ఉంటూనే ఉండేవాడు. కాని ఈమద్య కాలంలో వివాదాలతో కాని సినిమాలతో కాని మీడియా ముందుకు రావడం లేదు. నాగార్జునతో వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్’ చిత్రం ఫలితం తారుమారు అవ్వడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు.అయితే వర్మ సైలెంట్ గా ‘భైరవగీత’ అనే చిత్రాన్ని నిర్మించాడు.

ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగిసినట్లుగా తెలుస్తోంది.ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. హీరో – హీరోయిన్ లోతైన ప్రేమలో ఉన్నట్లుగా చూపిస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం పంపిణీ హక్కులను అభిషేక్ పిక్చర్స్ దక్కించుకోవడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.

 

Image result for varma bhairava geethaఈ చిత్రంతో సిద్దార్థ తాతులు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కథను నమ్మి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.రేపు ట్రైలర్ విడుదల కాబోతున్న ఈ చిత్రంను వర్మ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో చూడాలి.