గద్దలకొండ గణేష్ వాల్మీకి సినిమా రివ్యూ…

491

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్ర గద్దల కొండ గణేష్ వాల్మీకి. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాకి హైప్ తీసుకువచ్చింది చిత్ర యూనిట్. ఇందులో వరుణ్ తేజ్‌ను నెగిటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్‌ లుక్‌లో చూపించారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం తమిళ ‘జిగర్తాండ’కు రీమేక్. తమిళ నటుడు అధర్వ మురళి హీరోగా నటించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దామా.

Image result for valmiki posters

కథ :
సినిమా కథ విషయానికి వస్తే ఒక వ్యక్తి గుండగా ఎందుకు మారాడు..అతను చివర్లో మంచిగా ఎలా మారాడు అనేదే సినిమా కథ. అయితే ఈ కథలో గణేష్ మంచిగా మారడానికి కారణం అధర్వ మురళి. అధర్వ మురళి దర్శకుడు అవ్వాలని కలలు కంటాడు. ఒక నిజ జీవిత కథను సినిమాగా తీసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే చాలామంది కథలు అనుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు. చివరికి ఒక వ్యక్తి రౌడీగా ఎలా మారాడు అనే కథను తీయాలనుకుంటాడు. అప్పుడే అతనికి గద్దల కొండా గణేష్ గుర్తుకువస్తారు. అతని కథనే సినిమాగా తీయాలనుకుంటాడు. అతని దగ్గరకు వెళ్లి అతను ఎందుకు గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడో తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీదేవితో తాను నడిపిన ప్రేమకథను చెప్తాడు గద్దలకొండ గణేష్.. అతని ప్రేమకథ ఏమిటి.. శ్రీదేవి ఏమైంది.. ఎందుకు గణేష్, శ్రీదేవి విడిపోయారు.. గణేష్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది సస్పెన్స్. సినిమా చివరికి గద్దలకొండ గణేష్ ఏమయ్యాడు అనేది మిగతా కథ.

Image result for valmiki posters

కథనం :
సినిమా కథనం విషయానికి వస్తే అద్భుతంగా తీశాడు హరీష్ శంకర్. ప్రతి సీన్ కూడా చాలా బాగావచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించాడు. ఒక విలన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు వరుణ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు అతను తప్ప ఇంకెవరు న్యాయం చెయ్యలేరు అనే విధంగా నటించాడు. గద్దల కొండ గణేష్ పాత్రలో జీవించిపోయాడు. ముఖ్యంగా తన ప్రేయసి శ్రీదేవితో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఉన్నది కొద్దిసేపు అయినా శ్రీదేవి పాత్రలో పూజా హెగ్డే మంచి నటనను కనపరిచింది. ఇక సినిమా పిచ్చి ఉన్న పాత్రలో అధర్వ మురళి అద్భుత ప్రదర్శనను కనపరిచాడు. అతను ఇంతకముందు తెలుగు వారికి తెలియదు కాబట్టి ఒక అతని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు బాగా నచుతుంది. ఇక మరొక హీరోయిన్ మృణాళిని కూడా తన పరిధి మేరకు మంచిగానే నటించింది. అధర్వ మురళి, మృణాళిని మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. మొత్తానికి సినిమా అద్భుతంగా ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

ప్లస్ పాయింట్స్..
వరుణ్ సందేశ్, పూజాహెగ్డే, అధర్వ మురళి నటన..
డైరెక్షన్, స్క్రీన్ ప్లే..
సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

మైనస్ పాయింట్స్..
అక్కడక్కడ వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్..

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్.. 3.5 / 5