మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మూవీ లాంచ్…తరలివచ్చిన మెగా హీరోలు

177

మెగా ఫ్యామిలీ నుంచి మరో నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.. నేడు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నాడట. సుకుమార్ కథను అందించాడు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించగా.. అల్లు అర్జున్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులు స్క్రిప్ట్‌ను అందించారు. వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు. జానీ సినిమాలో చిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గా కూడా న‌టించాడు.