శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయండి అంటూ తమిళ హీరో ఫిర్యాదు..శ్రిరెడ్డి మీద విరుచుకుపడ్డ త్రిష..

497

కాస్టింగ్ కోచ్ విషయంలో తెలుగు ఇండస్ట్రీ లో ప్రకంపనలు స్ప్రుష్టించిన శ్రిరెడ్డి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద పడింది.అయితే అక్కడ ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.శ్రిరెడ్డి చేస్తున్న కామెంట్స్ మీద చట్ట పరమైన చర్యలు తీసుకోడానికి రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై తమిళ నటుడు వారాహి కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు చేశాడు.క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ సినీ నటులు, ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. కొందరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇప్పుడు అదే పద్దతిని తమిళ పరిశ్రమలో చేస్తున్నది.కావున శ్రీరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలి.వేషాల కోసం తాను వ్యభిచారం చేయాల్సి వచ్చిందనే విధంగా మాట్లాడింది.వ్యభిచారం కేసులో శ్రీరెడ్డి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీరెడ్డి వివాదంపై అందాల నటి త్రిష తీవ్రంగా స్పందించారు.అలాంటి విషయాలకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు శ్రీరెడ్డి అంటే ఎవరో తనకు తెలియదు. ఆమె గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వివాదానికి ప్రచారం చేయవద్దు. దీనిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాలు సృష్టించవద్దని శ్రీరెడ్డికి నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఇప్పటికే హెచ్చరించారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టింది.తప్పుడు ఆలోచనలతో వివాదాలు సృష్టించేవారికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ సహకరించవద్దు. శ్రీరెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. క్యాస్టింగ్ కౌచ్‌‌ పేరుతో వివాదాలు సృష్టించడం మానుకోవాలి అని ఐశ్వర్య మీనన్, అర్తన లాంటి యువ హీరోయిన్లకు త్రిష సూచించారు.