చిరంజీవికి ఉయ్యాల‌వాడ వంశం సెగ‌

451

కొణిదెల ప్రోడ‌క్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఈ సినిమాని రామ్ చ‌ర‌ణ్ సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు..బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించ‌నున్నారు..మెగాస్టార్ చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు… ఇక ఈ సినిమా పై ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

Image result for saira narasimhaద‌ర్శకుడు సురేంద్ర‌రెడ్డి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూల్స్ ఈ చిత్రం పూర్తి చేసుకుంది.. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఉయ్యాల‌వాడ వంశీకుల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.తమ వంశ పురుషుడి వీరోచిత గాథను తెరకెక్కిస్తూ.. నామ మాత్రంగానైనా తమను గుర్తించకపోవడంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చ‌రిత్ర‌ను సినిమాగా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది కాని మా నుంచి ఎటువంటి అవ‌స‌రం లేదు అనేలా మ‌మ్మ‌ల్ని గుర్తించ‌డం లేదు అని వారు బాధ‌ప‌డుతున్నారు.

Image result for saira narasimhaతాము క‌ర్నూలు నుంచి హైద‌రాబాద్ చుట్టూ తిరుగుతున్నాము అని తెలియ‌చేస్తున్నారు… చిరంజీవిగానీ, నిర్మాత రాంచరణ్ గానీ తమను పట్టించుకోవడం లేదని బాధ‌ప‌డుతున్నారు. తాము రోజూ రావ‌డం చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ తో మాట్లాడ‌దాము అని అనుకుంటే సిబ్బంది దీనికి స‌హ‌క‌రించ‌డం లేదు అని వారు వాపోతున్నారు.