యూత్ తప్పక చూడాల్సిన జస్టిన్ బీబర్ రియల్ స్టొరీ

162

23 ఏళ్ల వయసు…కాలేజీలో జాయిన్ అయ్యి సరదాగా స్నేహితులతో గడిపే ఏజ్ ఇది. కానీ ఒక 23 ఏళ్ల కుర్రాడు అత్యంత్య ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు, 12 అమెరికా మ్యూజిక్ అవార్డ్స్, 13 బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డ్స్, 8 గిన్నిస్ బుక్ రికార్డ్స్, 1400 కోట్ల ఆస్థి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడంటే మీరు నమ్ముతారా.. పలకబలపం పట్టుకునే వయసులోనే పియానో, డ్రమ్స్ పట్టుకున్నాడు. తనకు ఇష్టమైన మ్యూజిక్ నే కెరీర్ గా ఎంచుకుని కష్టపడ్డాడు. ఇప్పుడు తన పాటలతో ప్రపంచంలోనే ఫెమస్ సెలెబ్రెటీగా పేరు సంపాదించాడు. అతనే జస్టిన్ బీబర్. ఇతని పేరు తెలియని అతని పాట వినని కుర్రకారు ఉండరు. అసలు ఒక చిన్న కుర్రాడు ఇంత విజయం ఎలా సాధించాడు. అతను జీవితంలో చేసిన తప్పులు ఏంటి, తన తప్పులను తెలుసుకుని మళ్ళి పైకి ఎలా ఎదిగాడు. ఇలా జస్టిన్ బీబర్ గురించి అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for జస్టిన్ బీబర్

జెర్మీ బీబర్, ఫ్యాటీ మ్యారీడ్ ఇద్దరు ప్రేమికులు. ఫ్యాటీ మ్యారీడ్ 18 ఏళ్ల వయసులోనే పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. అయితే డాక్టర్స్ ఆమెను అబార్షన్ చేయించుకో అని సలహా ఇచ్చారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.దాంతో 1994 మర్చి 1 వ తేదీన కెనడాలో జస్టిన్ బీబర్ జన్మించాడు. జస్టిన్ బీబర్ జన్మించిన తర్వాత ఇద్దరు ప్రేమికులు విడిపోయారు. తర్వాత ఫ్యాటీ కష్టపడి జస్టిన్ బీబర్ ను పెంచింది. చిన్నవయసులోనే జస్టిన్ బీబర్ పాటలు పాడటం, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఫ్యాటీ కూడా బాగా ప్రోత్సహించింది. జస్టిన్ బీబర్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లోకల్ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొని సెకండ్ ప్లేస్ సాధించాడు. అప్పుడు ఫ్యాటీ తన కొడుకు పాడిన పాటలను వీడియోలుగా తీసి యూట్యూబ్ లో కీడ్రాళ్ అనే ఛానల్ ను ఓపెన్ చేసి అందులో పబ్లిష్ చేసేది. ఆ వీడియోలు మెల్లగా పాపులర్ అయ్యాయి. ఒకరోజు స్కూటర్ బ్రాన్ అనే ఒక వ్యక్తి జస్టిన్ బీబర్ వీడియోలను యూట్యూబ్ లో చూసి ఇతను ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని ముందే ఉహించాడు. అలా బీబర్ తల్లిని కలిసి తన ఆల్బమ్ లో పాడమని అడిగాడు. ఇక్కడే జస్టిన్ బీబర్ లైఫ్ స్టార్ట్ అయ్యింది.అలా బీబర్ పాడిన వన్ టైమ్ అనే పాట 2009 లో విడుదల అయ్యింది.

Image result for జస్టిన్ బీబర్

అలా విడుదల అయినా మొదటివారంలోనే కెనడాలో టాప్ 12 స్థానాన్ని కైవసం చేసుకుంది.అంతేకాదు ఆ పాట అమెరికాలో ప్లాటినం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో గోల్డ్ సర్టిఫికెట్ పొందింది. అలా మొదటి పాటతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 2009..మైకేల్ జాక్సన్ చనిపోయిన సంవత్సరం.. ఒక లెజెండ్ చనిపోయాడు అని అనుకుంటున్నా సమయంలో మరొక లెజెండ్ తయారవుతున్నాడు. 2010 మార్చిలో విడుదల అయినా నెవర్ లెడ్జిగో అలాగే మై వరల్డ్ 2.ఓ..ఈ రెండు ఆల్బమ్స్ ఇంటర్నేషనల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఇందులో మై వరల్డ్ అమెరికాలోని టాప్ 5 లో స్థానం సంపాదించింది. అదే సంవత్సరం వచ్చిన బేబీ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ ఉన్న సాంగ్ గా బేబీకి రికార్డ్ సంపాదించింది. కానీ తర్వాత గంగ్నమ్ స్టైల్ సాంగ్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది. అంతేకాదు ఈ సంవత్సరమే జస్టిన్ బీబర్ ఇంటర్ నెట్ లో మోస్ట్ సెర్చింగ్ పర్సన్ గా రికార్డ్ సాధించాడు.

ఈ క్రింది వీడియో చూడండి

ఒక్కొక సమయంలో జస్టిన్ బీబర్ ఒక నెలలోనే 300 కోట్లకు పైగా సంపాదించేవాడు అంటేనే అర్థం చేసుకోండి అతను ఏ విధంగా ఫెమస్ అయ్యాడో. 2011 లో జస్టన్ బీబర్ జీవితం ఆధారంగా తీసిన జస్టిన్ బీబర్ నెవర్ సే నెవర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 13 మిలియన్ అమెరికన్ డాలర్స్ తో నిర్మించిన ఈ సినిమా 100 మిలియన్ డాలర్స్ సంపాదించింది. ఫోర్బ్స్ 2011,12,13 లలో మోస్ట్ సెలెబ్రెటీగా గుర్తించింది. ఇదే సమయంలో జస్టిన్ బీబర్ సెరెనా గోమేష్ తో ప్రేమలో పడ్డాడు. జస్టిన్ బీబర్ ను వదిలేయకపోతే చంపేస్తాం అని సెరెనా గోమేష్ ను బెదిరించేవారు అంటేనే అర్థం చేసుకోండి జస్టిన్ బీబర్ కు లేడి ఫాలోయింగ్ ఎంతలా ఉందొ. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న జస్టిన్ బీబర్ లైఫ్ లో కష్టకాలం మొదలైంది.మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినందుకు 2014 లో జస్టిన్ బీబర్ అరెస్ట్ అయ్యాడు. అతని మీద ఇంకా ఎన్నో కేసులు కాంట్రవర్సీలు వచ్చాయి. తర్వాత తన తప్పును తెలుసుకుని ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్తూ ‘ సారి ‘ అనే సాంగ్ ను రిలీజ్ చేశాడు. తర్వాత వాట్ డు యు మీన్ అనే సాంగ్ రిలీజ్ చేసి మళ్ళి ప్రజల నమ్మకాన్ని అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు బీబర్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

Image result for జస్టిన్ బీబర్

అందం డబ్బు కీర్తి, ఇవన్ని పక్కన పెడితే బీబర్ కు మంచి మనసు కూడా ఉంది.తన కారును వేలంపాట వేసి దాని ద్వారా వచ్చిన 4 లక్షల 34 వేల డాలర్స్ ను ఛారిటీకి ఇచ్చాడు. అంతేకాదు ఒకసారి తన జుట్టును ఈబేలో అమ్మితే 40 వేల 668 డాలర్స్ వచ్చాయి. వాటిని కూడా డొనేషన్స్ కు ఇచ్చాడు. పెన్సిల్స్ ఆఫ్ ప్రామిస్ అనే ఎన్జీవో ద్వారా వెనుకబడిన ప్రాంతాలలో పాఠశాలలను కట్టించడం, పిలిపైన్స్ లో చిన్న పిల్లల ఆరోగ్యం కోసం, మంచి నీటి కోసం, 20 కోట్లకు పైగా సేకరించడం, మేక్ ఏ విష్ ద్వారా ఎంతో మంది అభిమానులకు సహాయం చెయ్యడం..ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు. 23 ఏళ్ల వయసు అంటే..జీవితం అంటే ఏంటో తెలుసుకోవడం అప్పుడే మొదలవుతుంది. కానీ ఆ చిన్న వయసులోనే కీర్తి, సంపాదన, కష్టం, సుఖం అన్ని అనుభవించాడు. అంతేకాకుండా అంత చిన్న వయసులో సింగర్ గా, రైటర్ గా, నటుడిగా, మ్యుజిషియన్ గా డాన్సర్ గా రాణిస్తున్న జస్టిన్ బీబర్ జీవితం మన అందరికి ఎంతో ఆదర్శం.మరి జస్టిన్ బీబర్ గురించి అతని లైఫ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.