ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న మెగా కోడలు ఉపాసన..

358

మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బిజినెస్ పరంగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట ‘ఫోర్బ్స్‌ ఇండియా’ విడుదల చేసిన ఉజ్వల భవిష్యత్ ఉన్న శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఉపాసన చోటు దక్కించుకుంది.

Image result for upasana

మొత్తం 22 మందితో కూడిన ఈ జాబితాలో తెలుగు నుండి పివి సింధుకు కూడా చోటు దక్కింది.అపోలో వ్యాపారాన్ని ఆమె నడిపిస్తున్న తీరు, ఆమె శక్తి సామర్థ్యాలు, ఆలోచన విధానానికి ఇప్పటికే పలువురు నుండి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ కూడా ఉపాసన శక్తి సామార్థ్యాలు గుర్తించి ఫోర్బ్స్ జాబితాలో చోటు ఇవ్వడం ఆమెకుం మరింత సంతోషాన్ని ఇచ్చింది..

Image result for upasana

‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట ముంబైలో మంగళవారం జరిగే ఈ వెంటులో ఉపాసనతో పాటు ఫోర్బ్స్ ప్రకటించిన 22 మంది ఇన్నోవేటర్స్, ఎంట్రెపెన్యూర్స్‌ను సత్కరించనున్నారు. ఉపాసనకు ఈ గొరవం దక్కడంపై మెగా అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.