విజయనిర్మల మొదటి భర్త ఎవరో తెలుసా? ఎందుకు విడిపోయారో తెలుసా?

340

తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన నటి, డైరెక్టర్ విజయనిర్మల. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి,ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈమె అతిచిన్న వయస్సులోనే బాలనటిగా చిత్ర రంగం ప్రవేశం చేసి ఎన్నో చిత్రాలలో అలరించింది. నాలుగేళ్ల వయస్సులోనే అంటే 1950లో మత్సరేఖ అనే తమిళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో రెండు సినిమాల్లో బాలనటిగా చేసింది. 1946 ఫిబ్రవరి 20న మద్రాసులో జన్మించిన ఈమె అసలు పేరు నిర్మల. తమిళంలో 1965లో ‘యంగవీటు పెళ్ళై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ సంస్థ ఈ సినిమా తీయడం,అప్పటికే నిర్మలమ్మ అనే నటి ఉండడం వంటి కారణాల వలన తన పేరును విజయ నిర్మల గా మార్చుకుంది. ఇక అదే ఏడాది తెలుగులో మంచి కుటుంబం అనే సినిమాలో చేసింది. అందులో అక్కినేని హీరోగా చేసారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఆనాటి నుంచి హీరోయిన్ గా తన హావా సాగిస్తూ వచ్చిన విజయనిర్మల తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ అయ్యింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు. నిజానికి కృష్ణకు ఈమె రెండో భార్య. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే కావడం విశేషం. విజయ నిర్మల హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా రంగప్రవేశం చేసి మీనా, కవిత, బెజవాడ బెబ్బులి, దేవదాస్, హేమాహేమీలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె మొదటి భర్త ఎవరన్నది చాలామందికి తెలీదు. అసలు ఈమె హీరోయిన్ గా చేస్తున్న సమయంలో కృష్ణమూర్తి అలియాస్ కె ఎస్ మూర్తి షిప్ డిజైనింగ్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. అయితే సినిమాల్లో చేసే విషయంలో ఇద్దరి మధ్యా విబేధాలు పొడచూపాయి. దాంతో ఒక బిడ్డకు తల్లిగా ఉన్న విజయనిర్మల విడాకులు తీసుకుంది. కొడుకుని తానే పెంచింది. అతనే నరేష్. ఒకప్పుడు హీరోగా, కామెడియన్ హీరోగా, ఇప్పుడు కేరక్టర్ యాక్టర్ గా రాణిస్తున్నాడు.

Image result for vijaya nirmala

ఇక విడాకులు తీసుకున్న తర్వాత పూర్తీగా సినిమాల మీదనే దృష్టి పడింది. సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చెయ్యడంతో ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగింది. తర్వాత స్నేహితులు అయ్యారు. ఆ స్నేహమే కొన్నిరోజులు ప్రేమగా మారింది. ఒక సంవత్సరం ఇద్దరు డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో పెళ్లయింది. అయినా కానీ విజయనిర్మల మీద మనసు పారేసుకున్న కృష్ణ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే ఇద్దరికీ విడివిడిగా పిల్లలు ఉండడంతో ఈ ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారు. ఇలా విజయ నిర్మల తన మొదటి భర్తను వదిలేసి తర్వాత కృష్ణను పెళ్లి చేసుకుంది. మరి విజయనిర్మల గురించి ఆమె మొదటి పెళ్లి వివరాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.