ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

1979

సినిమా అనేది వినోదం.హాస్యప్రదంగా ఉంటె మరి మంచిది.ఆరోగ్యకరమైన నవ్వు ఉంటె దానిని మించింది లేదు.అందుకే నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అని జంధ్యాల ఎప్పుడో చెప్పాడు.సినిమాలలో నవ్వించడానికి కమెడియన్స్ కు కొదువ లేదు.ప్రస్తుత పరిస్థితిలో అయితే దాదాపు 70 మంది కమెడియన్స్ టాలీవుడ్ లో ఉన్నారు.పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలిగే సత్తా ఉన్నవాళ్లే అందరు.ఎవరి మొహాన్ని చుసిన చాలు నవ్వొస్తుంది.అలాంటి ఒక టాప్ కమిడియన్ లలో ఒకడైన సుధాకర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా అయ్యింది.మరి సుధాకర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూద్దామా.

Image result for sudhakar

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓరెయ్..నాన్న నీ అబ్బా..అంటూ తండ్రీని ముద్దు ముద్దుగా తిట్టడం..నా పేరు షణ్ముఖ శల్మ ఎన్ని సార్లు చెప్పాలి యువర్ ఆనల్..అంటూ డైలాగ్ కొట్టి నవ్వించినా అది ఒక్క సుదాకర్ కి మాత్రమే చెల్లుతుంది.హీరోగా, విలన్ గా, సహనటుడిగా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన సుధాకర్ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్లో కమీడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు..సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం.తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్.తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు. తొలిసారి హీరోగా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సుధాకర్ తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ కమీడియన్లలో ఒకరిగా మారారు మెగాస్టార్ చిరుకి చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ సుధాకర్ మంచి స్నేహితుడు. తమిళంలో దాదాపుగా 50 చిత్రాలకు పైగా నటించి అటుపై తెలుగులో దాదాపుగా 600 చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. ఇక నిర్మాతగాను సుధాకర్ నాలుగు సినిమాలను తెరకెక్కించారు. అటు హిందిలో సైతం అరంగేట్రం చేసి శుభ్ కామ్న అనే చిత్రంలో నటించడం జరిగింది. పొట్ట చేతపట్టుకుని తమిళ ఇండస్ట్రీ కి వెళితే, తెలుగు నటుడు కావడం తో చిన్న చూపు చూసారు అందరు, కానీ వాటిని కూడా అధిగమించి, నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు సుధాకర్.

ఈ క్రింద వీడియోని చూడండి

అలాంటి హాస్య నటుడు, జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకూ సైతం వెళ్లినట్లు హైదరాబాద్లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు, కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు అని సైతం తెలుస్తుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన డేట్స్ కోసం ఎగబడిన దర్శక నిర్మాతలు, ఆయనతో నటించాలి అని ఉవ్విళ్లూరిన కధానాయకులు ఎవ్వరూ ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవడం లేదు కదా, కనీసం పలకరించే నాధుడే లేదు.దాదాపుగా అందరి హీరోలతో సుధాకర్ నటించి మెప్పించారు.అయితే ఇప్పుడు అతనిని పట్టించుకునే హీరోనే లేడు.ఇప్పటికైనా పరిశ్రమ మేల్కోని అంతా అయిపోయాక వెళ్ళి కన్నీళ్ళు కార్చే కన్నా, ఇప్పుడే ఆయన్ని అక్కున చేరుకోవాలని ఆశిద్దాం. అనారోగ్య కారణంగా సినిమాలకు దూరం అయిన ఆయన, ప్రస్తుతం పూర్తిగా కోలుకొని రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. మళ్ళీ అదే ఊపుతో అందరిని నవ్వించాలని ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సుధాకర్ గురించి అలాగే ఇప్పుడు అతని పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.