హీరోయిన్ లని మించిన అందంతో శ్రీకాంత్ కూతురు ఇప్పుడు ఎలా తయారైందో చూస్తె షాక్ అవుతారు..!!

669

విలన్ గా ఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి చివరికి హీరోగా సెటిల్ అయ్యారు శ్రీకాంత్. ఏ నటుడైనా వంద సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు.. కానీ.. చాలా చిన్న పాత్రలతో పరిచయమై.. విలన్ గా మెప్పించి.. ఆ తర్వాత హీరోగా రాణించి.. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో శెభాష్ అనిపించుకుని సెంచరీ కొట్టడం ఆషామాషీ కాదు. స్వయంకృషితో చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని శ్రీకాంత్ ఎదిగిన విధానం ఎంతో మంది అప్ కమింగ్ ఆర్టిస్టులకు ఇన్‌స్పిరేషన్.. ఆ రోజుల్లో అందరు కుర్రాళ్లలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి డ్యాన్సులు చూసి చిన్నప్పటి నుంచే సినిమా నటుడై పోవాలని ఫిక్స్ అయిపోయాడు. డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ మెగాస్టార్ చలవతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.

Image result for hero srikanth daughter

ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకాంత్ సతీమణి ఊహ కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాంత్ ఊహ దంపతులకు ముగ్గురు పిల్లలు. రోషన్ రోహన్ కూతురు మేధా. వారుకూడా తెలుగు సినీకళామాతల్లికి సేవలందిస్తున్నారు.పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా తెరంగేట్రం చేసాడు. నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మరికొన్ని సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక రెండో కొడుకు రోహన్ కూడా ప్రభుదేవా నటిస్తున్న ఒక త్రిభాషా చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వనున్నాడు. ఇక శ్రీకాంత్ కూతురు మేధా(Medha) కూడా రుద్రమ్మ దేవి చిత్రంలో చిన్నారి రుద్రమ్మ దేవిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో ఉంది మేధా. అయితే ఇప్పుడు శ్రీకాంత్ కూతురు మేధా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా తెలిసింది.

ఈ క్రింది వీడియో చూడండి

మేధా బాస్కెట్ బాల్ ఆటలో జాతీయస్థాయి క్రీడాకారిణినట. ఈ విషయాన్నీ స్వయంగా శ్రీకాంతే వెల్లడించారు. అతను నటించిన తాజా చిత్ర ప్రమోషన్ లో తన నటవారసుల గురించి ప్రస్తావిస్తూ మేధా గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పారు. ” నా కూతురు మేధా బాగా చదువుతుంది. చదువు తప్పించి తనకు ఏ ఆసక్తిలేదు. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడుతుంది. నేషనల్ బాస్కెట్ బాల్ టీమ్ కి కూడా ఎంపికైంది అని మేధా బహుముఖ ప్రజ్ఞ గురించి ఆనందంగా చెప్పారు”. త్వరలో అమెరికాలో జరిగే WNBA పోటీలో కూడా పాల్గొంటుందంట. ఇలా సినిమాలలో నటిస్తూనే చదువు, బాస్కెట్ బాల్ లోను జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది మేధా.ఆమె ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుందాం. మరి శ్రీకాంత్ గురించి ఆయన పిల్లలు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.