శేఖర్ మాస్టర్ కు క్రేజ్ రాకముందు ఎంత దీనస్థితిలో బతికాడో తెలిస్తే కన్నీళ్లాగవు

352

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు శేఖర్ మాస్టర్. అగ్రహీరోలతో స్టెప్స్ వేయిస్తూ టాప్ రేంజ్ కి చేరాడు. ప్రభుదేవాను చూసి కొరియోగ్రాఫర్ గా మారిన శేఖర్ చివరకు ప్రభుదేవా సినిమాకు కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఆరేళ్ళు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, ఎనిమిదేళ్లు అసిస్టెంట్ డాన్సర్ గా చేసాడు. మెగాస్టార్ చిరంజీవి పాటలు చూసి డాన్స్ పై ఇష్టం పెంచుకున్న శేఖర్ చివరకు ,అమ్మడు లెట్స్ కుమ్ముడు అంటూ చిరంజీవి చేత స్టెప్పులేయించే స్థాయికి ఎదిగాడు. అగ్ర హీరోలందరి సినిమాల్లో కనీసం ఒక్కపాటైనా శేఖర్ కొరియోగ్రాఫర్ గా ఉండితీరాల్సిందే. ఇంత పేరు రావడం వెనుక శేఖర్ మాస్టర్ ఎన్నో కష్టాలను అనుభవించాడు.

Image result for shekar master

చిన్నతనంలో నాన్న చనిపోవడం,అమ్మ ఎంత వద్దంటున్నా సరే డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చిన శేఖర్ మాస్టర్ ఎన్నో కష్టాలు,బాధలు,ఆటుపోట్లు చవిచూసి మంచి పొజిషన్ కి వచ్చాడు. 1979నవంబర్ 6న విజయవాడలోని అమెరికన్ ఆసుపత్రిలో పుట్టాడు. తల్లి నర్స్ గా చేసేది.శిరీషను వివాహ మాడిన శేఖర్ కి ఒక పాప సాహితీ,ఒక బాబు విన్నీ ఉన్నారు. సాహితీ పేరిట డాన్స్ స్కూల్ కూడా పెట్టిన శేఖర్ ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ కోసం వెచ్చిస్తాడు. బాబు విన్నీ కూడా ఢీ డాన్స్ షోలో పాల్గొని అలరిస్తాడు. విజయవాడ గవర్నర్ పేట అన్నధామస్ స్కూల్లో 5వ తరగతి వరకూ చదివిన శేఖర్, తర్వాత తండ్రి మరణంతో గుణదల బోర్డింగ్ స్కూల్ లో చేరాడు.

Image result for shekar master

ఇంటర్ శారదా కాలేజీలో చదివాడు. విజయవాడలోనే కొన్నాళ్లు డాన్స్ నేర్చుకున్న శేఖర్ ఆతర్వాత హైదరాబాదు లో డాన్స్ నేర్చుకోడానికి వెళ్తానంటే వద్దని వాళ్ళ అమ్మ వారించింది. చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్పినా సరే,తల్లిని ఒప్పించి హైదరాబాద్ వచ్చేసిన శేఖర్, ఆతరువాత రాకేష్ మాస్టర్ దగ్గర సత్య మాస్టర్ తో కల్సి చేరాడు. రాకేష్ మాస్టర్ కి అనతికాలంలోనే శేఖర్ ప్రియశిష్యుడు అయ్యాడు. ఫీజు తీసుకోకుండా రాకేష్ మాస్టర్ క్లాస్ చెప్పేవాడట. అయితే రాకేష్ కి తిరుపతిలో కూడా డాన్స్ స్కూల్ ఉండడంతో ఎప్పుడైనా అక్కడకు వెళ్తే,ఇక్కడి స్కూల్లో పిల్లలకు క్లాస్ తీసుకునే బాధ్యత శేఖర్ వహించేవాడట. 8ఏళ్ళు ఇలా కష్టపడి డాన్స్ నేర్చుకున్న శేఖర్ ఆకలితో ఎన్నోసార్లు అలమటించిన సందర్భాలున్నాయని, ఒక్కసారి ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి భోజనం చేసేవాడినని ఎన్నోసార్లు శేఖర్ చెప్పడం తెల్సిందే. రాకేష్ నుంచి బయటకు వచ్చాక ఛాన్స్ లకోసం పరితపిస్తుంటే వినయ్ అనే కో డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడని శేఖర్ చెబుతాడు.

 

మొత్తానికి శేఖర్ జీవితం అనూహ్య మలుపు తిరిగి టాప్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. అయితే తల్లి ఇప్పటికీ నర్స్ గా పనిచేస్తూనే ఉంది. ఇక శేఖర్ మాస్టర్ కి, రాకేష్ మాస్టర్ కి ఎన్నో గొడవలు జరిగాయట. తల్లిని హేళనగా మాట్లాడడం,అందరి ముందు తిట్టడం వంటివి రాకేష్ మాస్టర్ లో నచ్చలేదని శేఖర్ చెప్పేమాట. అయితే తమ మధ్య విభేదాలు రావడానికి వినయ్ కారణమని,ఖైదీ నెంబర్ 150లో ఛాన్స్ వచ్చిన విషయం శేఖర్ చెప్పలేదని రాకేష్ అలిగాడట. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. 2008లో స్టార్ట్ అయిన ఢీ డాన్స్ షో చూసి ఢీ 2లో ఛాన్స్ వస్తే బాగుండును అనుకుంటున్న సమయంలో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. అన్ని విభాగాల్లో పాల్గొన్న శేఖర్ మాస్టర్ ఢీ 5లో టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇక ఢీ 7నుంచి ప్రస్తుతం ఢీ 11వరకూ జడ్జిగా ఉంటున్నాడు. పోస్ట్ బాక్స్ అనే సినిమాకు కొరియోగ్రాఫర్ గా శేఖర్ చేసినప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆతర్వాత ఛార్మి హీరోయిన్ గా 2011లో వచ్చిన మంగళ సినిమాతో గుర్తింపు వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ తర్వాత సుధీర్ బాబు సినిమా ఎస్ ఎం ఎస్ తో మరికొంత గుర్తింపు వచ్చింది. అది చూసిన బన్నీఇచ్చిన ఛాన్స్ తో జులాయి టైటిల్ సాంగ్ కంపోజ్ చేసాడు. త్రివిక్రమ్ అది చూసి మంచి డాన్సర్ ని పరిచయం చేస్తున్నావని అన్నాడట. అలా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న శేఖర్ అగ్ర హీరోల సినిమాలకు చేస్తూ వస్తున్నాడు. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీలో కుంగ్ ఫు కుమారి పాటకు, జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్,నాన్నకు ప్రేమతో లవ్ మీ ఎగైన్,ఇద్దరమ్మాయిలు మూవీలో టాప్ లేచిపోద్ది,సన్నాఫ్ సత్యమూర్తితో సూపర్ మచ్చి, ఖైదీ నెంబర్ 150లో అమ్మడూ లెట్స్ కుమ్ముడూ, రంగస్థలంలో ఎంత సక్కగున్నావే వంటి పాటలతో టాప్ రేంజ్ కి వెళ్ళాడు. నిద్రలో కూడా కొత్తకొత్త స్టెప్స్ కోసం ఆలోచిస్తాడట. నిద్రలో గుర్తుకు వచ్చిన వెంటనే లేచి , కెమెరాలో బందిస్తాడట. అంతటి చిత్తశుద్ధి,కృషి ఉన్నందునే చదువు లేకున్నా , పెద్ద స్థాయికి ఎదిగాడు. 2013లో గుండె జారీ గల్లంతయింది మూవీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు అందుకున్నాడు.బ్రూస్ లీ, జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150 మూవీస్ కి ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు.శేఖర్ మాస్టర్ కెరీర్ ఇలాగే సాగిపోతూ ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుందాం. మరి శేఖర్ మాస్టర్ గురించి ఆయన అనుభవించిన కష్టాలు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.